Home> వినోదం
Advertisement

Anupama in DJ Tillu Square : రూమర్లకు చెక్.. తెలివైన అనుపమ.. హీరోతో ఇంత సాన్నిహిత్యమా?

Anupama in DJ Tillu Square అనుపమ పరమేశ్వరణ్ ఇప్పుడు లక్కీ ఛార్మ్‌గా మారింది. ఆమె నటించిన కార్తికేయ 2, 18 pages సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో గోల్డెన్ హ్యాండ్ అయింది. ఇప్పుడు ఆమెను వదులుకునేందుకు ఏ నిర్మాణ సంస్థ కూడా రెడీగా లేదు.

Anupama in DJ Tillu Square : రూమర్లకు చెక్.. తెలివైన అనుపమ.. హీరోతో ఇంత సాన్నిహిత్యమా?

Anupama in DJ Tillu Square సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా చిన్న సైజు సునామిని క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. డీజే టిల్లు కథ, కథనాలు కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. సిద్దు మ్యానరిజం, యాటిట్యూడ్, లుక్స్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సిద్దు డైలాగ్ డెలివరీ అందరినీ మెప్పించింది. ఇక రాధిక పాత్రలో నేహా శెట్టి సైతం ఆహా అనిపించింది.

రాధిక, డీజే టిల్లు పాత్రలకు జనాలు బాగానే కనెక్ట్ అయ్యారు. అయితే డీజే టిల్లు స్క్వేర్ అంటూ రాబోతోన్న సినిమాలో రాధిక కనిపించదు. నేహా శెట్టి పాత్రను తీసేశారు. నేహా శెట్టిని పక్కన పెట్టేశారు.  ఈ సీక్వెల్ కోసం వరుసగా హీరోయిన్లను మారుస్తూనే వచ్చాడు సిద్దు జొన్నలగొడ్డ. ఈ సీక్వెల్ విషయంలో సిద్దు కాస్త మొండిగా ప్రవర్తిస్తున్నట్టుగానే ఉన్నాడు. ఎందుకంటే సిద్దు చివరకు డైరెక్టర్‌ను కూడా మార్చేశాడు.

 

హీరోయిన్ల విషయంలో అయితే పదే పదే మార్పులు చోటు చేసుకుంటూనే వచ్చాయి. శ్రీ లీల, అనుపమ ఇలా చాలా పేర్లే వచ్చాయి. ఇలా అందరితో సిద్దుకి సెట్ అవ్వడం లేదని, అందుకే అందరినీ తీసేస్తున్నాడనే టాక్ వచ్చింది. అనుపమ అయితే సిద్దు ఓవర్ యాక్షన్, హద్దుల మీరే రొమాంటిక్ సీన్లు ఉండటంతో తప్పుకుందనే వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు అనుపమే డీజే టిల్లుకి తల దువ్వుతోంది. హెయిర్ స్టైలిష్ట్‌గా మారింది. అనుపమ చేసిన ఈ సేవలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఇంకొక ప్రొఫెషన్ దొరికిందని చెబుతూ తాను సెట్‌లో సిద్దుకి చేస్తున్న సేవలను చూపించింది అనుపమ. అంటే సిద్దుతో అనుపమకు ఎలాంటి గొడవలు లేవని, డీజే టిల్లు స్క్వేర్‌ సినిమాలో నటిస్తోన్నానను అంటూ చెప్పకనే చెప్పేసింది.

Also Read: Varun Dhawan-Samantha : ఒక్కసారి సమంతను కలిస్తే తెలుస్తుంది.. అండగా నిలిచిన బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్

Also Read: Thunivu Twitter Review : అజిత్ తెగింపు ట్విట్టర్ రివ్యూ.. డబ్బులు వేస్ట్ అయ్యాయట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More