Home> వినోదం
Advertisement

Anupama Parameswaran: 'దయచేసి ఇలా చెయ్యకండి'.. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసి అభిమాని ఎమోషనల్

Tillu Square: మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి టాలీవుడ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మలయాళీ అయినప్పటికీ తెలుగు పడుచులా ఉండే ఈ ట్రెడిషనల్ బ్యూటీ.. తన మెస్మరైజ్ లుక్స్ తో అభిమానులను కట్టిపడేసింది. రీసెంట్ గా ఆమె నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్ చూసి ఒక అభిమాని తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Anupama Parameswaran: 'దయచేసి ఇలా చెయ్యకండి'.. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసి అభిమాని ఎమోషనల్

Anupama Fan: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నాగచైతన్య ప్రేమమ్ మూవీ తో టాలీవుడ్ కి పరిచయమయ్యింది. ఆ తర్వాత నితిన్ నటించిన అ ఆ చిత్రంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. నిఖిల్ కార్తికేయతో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది.నిన్న మొన్నటి వరకు పద్ధతిగా ..చాలా ట్రెడిషనల్ గా కనిపించిన అనుపమ సడన్ గా ఒక్కసారి తన లుక్స్ ను మార్చేసింది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టు ఉంది అమ్మడు పరిస్థితి. సిద్దు జొన్నలగడ్డతో కలిసి అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది.

ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్ లో అనుపమ రొమాంటిక్ యాంగిల్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో అయితే.. లెంతీ లిప్ లాక్స్ కు ఎటువంటి కొదవలేదు. దీంతో అందరూ ఈ మూవీలో కొత్త అనుపమని చూస్తున్నామా అన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా అనుపమ ఫాన్స్ ఆమె ఇలా యాక్ట్ చేయడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఈ చిత్రం నుంచి ఎందరో హీరోయిన్లు హై రొమాంటిక్ సీన్లు చేయలేక తప్పుకున్నారు అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి.. అసలు ఈ మూవీ అనుపమ ఎందుకు చేస్తున్నట్లు అన్న డిస్కషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది.

అనుపమ అందాల ఆరబోత చూసిన అభిమానులు.. టిల్లు తో కలిసి అనుపమ పూర్తిగా మారిపోయింది.. నిన్ను ఇలా చూస్తుంటే బ్రేకప్ కంటే ఎక్కువ బాధ కలుగుతుంది.. అంటూ తమ బాధను సోషల్ మీడియా సాక్షిగా వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమాని ఏకంగా అ ఆ టైంలో అనుపమ ఫోటోను పక్కన పెట్టుకొని.. ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు అని బాధపడుతున్నాడు. అ ఆ, శతమానం భవతి ఇలాంటి అద్భుతమైన చిత్రాలలో నటించిన అనుపమ ఇలా టిల్లు స్క్వేర్ లాంటి మూవీ ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కాలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఒకప్పుడు సావిత్రి, సౌందర్య లాంటి వ్యక్తులతో అనుపమను పోల్చుకునే వాళ్ళమని.. అటువంటి హీరోయిన్ టిల్లు స్క్వేర్ లాంటి చిత్రాలు చేయడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆ అభిమాని బాధపడ్డాడు. అంతేకాదు ఇకనుంచి అయినా పద్ధతిగా ఉండే పాత్రలు ఎంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

 

మరి తన అభిమానుల కోరికను అనుపమ ఎంతవరకు మన్నిస్తుందో చూడాలి. ఇక టిల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే ఇది మార్చి 29న విడుదల కాబోతోంది.

Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More