Home> వినోదం
Advertisement

Bigg Boss 5 Telugu: కూతుర్ని చూడగానే రవి ఎమోషనల్..భావోద్వేగాలతో నిండిపోయిన ప్రోమో..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌ ఎమోషన్స్‌తో నిండిపోయింది. తాజా ప్రోమోలో రవి భార్య, కూతురు వియా సందడి చేశారు.  
 

Bigg Boss 5 Telugu: కూతుర్ని చూడగానే రవి ఎమోషనల్..భావోద్వేగాలతో నిండిపోయిన ప్రోమో..

Bigg Boss 5 Telugu latest Promo: కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ రాకతో బిగ్‌బాస్‌(Bigg Boss) హౌస్‌ ఎమోషన్స్ తో నిండిపోయింది. ఇప్పటికే కాజల్‌, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు ఎంటర్‌ అవగా, నేటి ఎపిసోడ్‌లో యాంకర్‌ రవి(Anchor ravi) కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన ప్రోమో(latest promo) తాజాగా రిలీజ్ అయ్యింది.

తొలుత హౌస్‌లోకి వెళ్లిన రవి భార్య ఆయన్ని హత్తుకోగానే.. ‘''వియా రాలేదా.. నేను తనని బాగా మిస్‌ అవుతున్నాను'' అని అన్నాడు . తాను ఎంతో ప్రయత్నించినప్పటికీ కుదరలేదని, అందువల్లే ఒక్కదాన్నే హౌస్‌లోకి వచ్చానని ఆమె చెప్పడంతో రవి నిరాశకు గురయ్యాడు.

Also Read: Bigg Boss 5 Telugu: పంచ్‌లు వేసిన మానస్ తల్లి...షణ్ముఖ్‌కి షాక్ ఇచ్చిన సిరి తల్లి..

కాసేపటికే... ''‘లవ్‌ యూ పప్పా''’ అంటూ వియా ఎంట్రీ ఇచ్చింది. దీంతో రవి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. కూతుర్ని దగ్గరకు తీసుకుని చిన్నపిల్లాడిలా మారి.. ఆటలు ఆడాడు. ఇక ‘వియా ఇంటిని వీడే సమయం ఆసన్నమైంది’’అని బిగ్‌బాస్‌ చెప్పగానే.. ''ఐ మిస్ యూ.. బాయ్‌ డాడీ''’’అంటూ ఆ చిన్నారి కన్నీరు పెట్టుకుంది.  ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తాజా ప్రోమోలో రవి కూతురు వియా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More