Home> వినోదం
Advertisement

Anchor Rashmi : తప్పులు చేస్తే క్షమించండి.. యాంకర్ రష్మీ పోస్ట్

Sridevi Drama Company Anchor యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు రష్మీ ఎంట్రీ చాలా యాదృశ్చికంగా జరిగింది. ఈ షోకు యాంకర్‌గా వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అభిమానులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

Anchor Rashmi : తప్పులు చేస్తే క్షమించండి.. యాంకర్ రష్మీ పోస్ట్

Sridevi Drama Company Anchor శ్రీదేవీ డ్రామా కంపెనీ యాంకర్‌గా రష్మీ వచ్చి ఏడాది అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఎంతగా అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. అయితే ఆమె శ్రీదేవీ డ్రామా కంపెనీకి యాంకర్‌గా వచ్చి ఏడాది అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హంగామా చేస్తున్నారు. ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. రకరకాల ఎడిట్ వీడియోలు చేస్తూ రచ్చ చేస్తున్నారు.

శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రారంభంలో ఎలా ఉంది.. దానికి యాంకర్లుగా ఎవరున్నారు.. మధ్యలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. ఇప్పుడు ఎవరు యాంకరింగ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. స్టార్టింగ్‌లో సీరియల్ హీరో అంబటి అర్జున్ యాంకరింగ్ చేశాడు. ఆ తరువాత సుధీర్ రంగంలోకి వచ్చాడు. సుధీర్ వచ్చాకే ఈ శ్రీదేవీ డ్రామా కంపెనీ షో రేటింగ్‌లు పెరిగిపోయాయి. నెంబర్ వన్ షోగా నిలిచింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే సుధీర్ బయటకు వెళ్లిపోయాడు.

సుధీర్ తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బుల్లితెరకు దూరం అయ్యాడు. ఢీ, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి షోలను వదిలేశాడు. ఆ తరువాత శ్రీదేవీ డ్రామా కంపెనీని కూడా వదిలేశాడు. అయితే సుధీర్ స్థానంలో వచ్చిన రష్మీ ఆ షోను బాగానే నడిపిస్తోంది. సుధీర్‌ను పరోక్షంగా గుర్తు చేస్తూనే ఇన్ని రోజులు ఆమె ఈ షోను నడిపిస్తూ వచ్చింది. ఈ షోకు యాంకర్‌గా వచ్చి నేటితో ఏడాది అయింది.

Also Read: Tamannaah Bhatia Photos: పొట్టి బట్టల్లో రచ్చ రేపుతున్న తమన్నా భాటియా.. ఫొటోలు చూశారా?

దీంతో రష్మీ అభిమానులు ఆమె మీద శుభాకాంక్షల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రతీ సండే నాకు ఎంతో స్పెషల్ అవుతోంది.. అందరూ సండే నాడు వస్తోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోను ఆదరిస్తూ ఉన్నారు.. ఆ షో అందరికీ నచ్చిందని తెలిసి ఎంతో సంతోషిస్తున్నాను.. ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి.. ఏదైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించండి.. ఇలానే ఆదరిస్తూ ఉండండి అని కోరింది రష్మీ.

Also Read: Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More