Home> వినోదం
Advertisement

Anchor Rashmi Gautam : మాల్దీవుల్లో ప్రతీ రాత్రి అంటూ.. యాంకర్ రష్మి సందడి

Rashmi Gautam at Night Time in Maldives యాంకర్ రష్మి ప్రస్తుతం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌కు సంబంధించి మాల్దీవులకు వెళ్లింది. మాల్దీవుల్లో రష్మి చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు.
 

Anchor Rashmi Gautam : మాల్దీవుల్లో ప్రతీ రాత్రి అంటూ.. యాంకర్ రష్మి సందడి

Rashmi Gautam at Night Time in Maldives యాంకర్ రష్మీ ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్‌ అంటూ తిరిగేస్తోంది. దీపిక పిల్లి, రష్మీ గౌతమ్ ఇలా అందరూ కలిసి ఫుల్ చిల్ అవుతున్నారు. ఇక ఈ న్యూ ఇయర్ కోసం కూడా మంచి వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. రష్మీ ఈ మధ్య మాల్దీవుల్లోనే తిష్ట వేసినట్టుంది. ఆ మధ్య కొన్ని హీటెక్కించే ఫోటోలను షేర్ చేసి కుర్రకారు మతులు పోగొట్టేసింది రష్మీ. ఇప్పుడు ఓ వీడియోను షేర్ చేసింది.

 

మన వాళ్లకి పానీ పూరి అంటే ఎక్కువగా ఇష్టం. అందులోనూ మహిళలకు అయితే పానీ పూరి అంటే మహా ఇష్టం. దాంతో రష్మీ గౌతమ్‌ ఇప్పుడు తన స్టైల్లో పానీ పూరిని తినేసింది. అది కూడా ఇండియాలో కాదు. మాల్దీవుల్లో రాత్రి పూట మన ఇండియన్ స్టైల్లో పానీ పూరి దొరుకుతుందట. ఇక పానీ పూరి తింటూ మన వాళ్లు ఎలా అడుగుతారో అలా అడిగేసింది. భయ్యా తోడా ప్యాజ్ దాలో అని క్యూట్‌గా రష్మీ అనేసింది.

మొత్తానికి రష్మీ మాత్రం తన పనులన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చి ఇలా రిలాక్స్ అవుతోంది. అసలే రష్మీ ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక సినిమాలపైనా రష్మీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. రష్మీ చివరగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో పలకరించింది. కానీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రష్మీకి వెండితెరపై సరైన బ్రేక్ రానట్టు అయింది. బుల్లితెరపై రష్మికి ఉన్న క్రేజ్.. వెండితెరపై కలిసి రావడం లేదు. ఇక సుధీర్, రష్మీలు కలిసి ఓ సినిమాను చేయబోతోన్నట్టు తెలిసిందే. మరి ఈ సినిమాతోనైనా రష్మికి మంచి బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More