Home> వినోదం
Advertisement

Ananya Nagalla: వెకేషన్లో రచ్చ రేపిన అనన్య.. థైస్ అందాలతో హాట్ ట్రీట్!


Ananya Nagalla: తెలుగమ్మాయి అనన్య నాగళ్ల తనదైన అందాలతో రెచ్చిపోతోంది. తాజాగా వెకేషన్ కు వెళ్ళిన ఆమె అక్కడ ఆకట్టుకునే అందాలతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Ananya Nagalla: వెకేషన్లో రచ్చ రేపిన అనన్య.. థైస్ అందాలతో హాట్ ట్రీట్!

Ananya Nagalla Raising Temperature: తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణలో సత్తుపల్లిలో జన్మించిన అనూష(అనన్య అసలు పేరు) తన తల్లిదండ్రుల వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లోనే సెటిలైంది. హైదరాబాదులోనే చదువుకుని ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో నటన మీద ఆసక్తి పెరగడంతో షాది అనే ఒక షార్ట్ ఫిలింలో నటిచింది. ఆ షార్ట్ ఫిలింకి సైమా అవార్డు కూడా దక్కడంతో ఆమెకు తనలో ఒక నటి ఉందనే విషయం అర్థమైంది. దీంతో సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఆమె మల్లేశం అనే సినిమాలో ప్రియదర్శి సరసన నటించింది. 

మొదటి సినిమా అనూష నాగళ్ల పేరుతోనే చేసిన తర్వాత తన పేరు అనన్యగా మార్చుకుంది. నిజానికి మొదటి సినిమా చేసిన తర్వాత ఆమెకు ప్లే బ్యాక్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కరోనా కారణంగా చాలా ఆలస్యంగా 2021 వ సంవత్సరంలో విడుదలైంది. ఇక అదే ఏడాది వకీల్ సాబ్ లో అన్యాయానికి గురైన ముగ్గురమ్మాయిలలో ఒకరిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక ఆ తర్వాత ఆమె మాస్ట్రో అనే సినిమాలో కూడా నటించింది కానీ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అంతగా పేరు రాలేదు. ప్రస్తుతం ఆమె సమంత కీలక పాత్రలో నటిస్తున్న శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. 

అయితే అనన్య అవడానికి తెలుగు అమ్మాయి అయినా ఈ మధ్యకాలంలో అందాలు ఆరబోసేందుకు ప్రయత్నాలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతుంది. రకరకాల యోగా ఫోజులు,  ప్రకృతిలో అందాలు ఆరబోయడం ఈమెకు బాగా అలవాటైపోయింది. తాజాగా ఎక్కడికో వెకేషన్ కు వెళ్లిన అనన్య అక్కడ తన తొడల అందాలు,  బ్యాక్ అందాలు చూపిస్తూ కొన్ని ఫోటోలు తీసి వాటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి హాట్ టాపిక్ గా మారింది. 
సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవడానికి ఆమె ఇలా చేస్తోందని కొందరు భావిస్తుంటే కాదు తాను హాట్ పాత్రలకైనా సై అని చెప్పడం కోసమే ఆమె ఇలా హాట్ ఫోటోషూట్లు వదులుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మొత్తం మీద ఈ తెలుగు అమ్మాయికి దర్శకనిర్మాతలు ఏ మేరకు ఆఫర్లు ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు అందాలు ఆరబోసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు అది కూడా నటనలో భాగమే కదా అంటూ దర్శక నిర్మాతలకి తెలుగమ్మాయిలు ఎదురు షాకలిస్తున్నారు. మరి తెలుగు అమ్మాయి అనన్య కూడా మరిన్ని అవకాశాలు అందుకుని తన కెరీర్ లో ముందుకు దూసుకు వెళుతుందేమో చూడాలి మరి.
Also Read: Ante Sundaraniki: నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తున్న అంటే సుందరానికి

Also Read: Anchor Suma: సుమ బంగారుతల్లి.. ఎవరికీ తెలియని గొప్పవిషయం బయటపెట్టిన సీనియర్ నటి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More