Home> వినోదం
Advertisement

Amitabh Bachchan - Chiranjeevi : చిరుని పట్టించుకోని అమితాబ్.. రజినికీ మాత్రం స్వీట్ రిప్లై

Amitabh Bachchan  Birthday అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖలంతా కూడా విషెస్ చెప్పారు. సోషల్ మీడియా అంతా కూడా అమితాబ్‌ను కీర్తించేసింది.

 Amitabh Bachchan - Chiranjeevi : చిరుని పట్టించుకోని అమితాబ్.. రజినికీ మాత్రం స్వీట్ రిప్లై

Amitabh Bachchan - Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ మధ్య ఉన్న మంచి రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి కోసం సైరాలో ఓ రోల్ పోషించాడు అమితాబ్ బచ్చన్. చిరంజీవికి గురువుగా అమితాబ్ నటించాడు. చిరు అమితాబ్ రిలేషన్ ఈనాటిది కాదు. దాదాపు మూడు దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య మంచి బంధం ఉంది. చిరంజీవి సినిమాల నుంచి దూరంగా, రాజకీయాలకు దగ్గరగా వెళ్లిన సమయంలోనూ వద్దని వారించాడట అమితాబ్. 150వ సినిమాను చేయాల్సిందే అని అమితాబ్ పట్టుబట్టిన విషయం తెలిసిందే.

అయితే అమితాబ్ బర్త్ డే అక్టోబర్ 11న చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి వారంతా కూడా విషెస్ చెప్పారు. సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా అమితాబ్‌కు విషెస్ అందించారు. గురువులాంటివారు.. అంటూ అమితాబ్ ఫోటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు చిరంజీవి. నటుల్లో ఎవరెస్ట్ వంటివారంటూ పొగిడేశాడు.  ఇక రజినీ సైతం ఇదే రేంజ్‌లో పొగిడేశాడు.  ఇండియన్ సినిమాకు  సూపర్ హీరో, సెన్సేషన్, ఇన్‌స్పైరింగ్ అంటూ ప్రశంసించాడు రజినీ.

 

అయితే రజినీ వేసిన ట్వీట్ మీద అమితాబ్ స్పందించారు. మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు.. మీ క్రేజ్, ఫాలోయింగ్‌తో నేను మీతో పోల్చుకోలేను రజినీ సర్ అంటూ ఇలా అమితాబ్ ట్వీట్ వేశాడు. కానీ చిరంజీవి వేసిన ట్వీట్ మీద మాత్రం ఇంత వరకు స్పందించలేదు. అసలు అమితాబ్ తనకు విషెస్ చెప్పిన వారికి ఇంకా రిప్లైలు ఇవ్వనేలేదు.

మరి వరుసపెట్టి అందరికీ అమితాబ్ రిప్లైలు ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి. ప్రధానికి మాత్రం బిగ్ బి రిప్లై ఇచ్చేశాడు. అంటే మొత్తంగా చూస్తే ప్రధాని, రజినీలకు మాత్రమే అమితాబ్ బచ్చన్ రిప్లైలు ఇచ్చాడు. మిగతా ఎవ్వరికీ ఇచ్చినట్టుగా కూడా కనిపించడం లేదు. అమితాబ్ చివరగా గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్

Also Read : Nagarjuna Lakshmi Daggubati Wedding : రేర్ పిక్.. నాగార్జున-లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More