Home> వినోదం
Advertisement

Pushpa First Review: అల్లు అర్జున్ పుష్ప సినిమా అదుర్స్.. బెస్ట్ టాలీవుడ్ 2021 సినిమా అంటున్న రివ్యూ

Pushpa First Review: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ మూవీ పుష్ప రేపు ప్రపంచమంతా విడుదల కానుంది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్న నేపధ్యంలో ఫస్ట్ రివ్యూ ఆసక్తి రేపుతోంది.

Pushpa First Review: అల్లు అర్జున్ పుష్ప సినిమా అదుర్స్.. బెస్ట్ టాలీవుడ్ 2021 సినిమా అంటున్న రివ్యూ

Pushpa First Review: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ మూవీ పుష్ప రేపు ప్రపంచమంతా విడుదల కానుంది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్న నేపధ్యంలో ఫస్ట్ రివ్యూ ఆసక్తి రేపుతోంది.

అందరూ ఊహించినట్టుగానే పుష్ప సినిమా ఎక్కడా తగ్గేదేలే అనేట్టుగా ఉందని తెలుస్తోంది. ప్రముఖ సినీ విశ్లేషకుడు, యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ(Pushpa movie first review)ఇచ్చేశాడు.ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమా..ఉమైర్ సంధూ రివ్యూతో మరింతగా అంచనాలు పెంచుకుంది. చెప్పినట్టుగానే ఎక్కడా తగ్గేదేలే అన్పిస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన ఉమైర్ సంధూ..ప్రశంసలు కురిపించాడు. బెస్ట్ టాలీవుడ్ మూవీగా(Best Tollywood Movie Pushpa)నిలవనుందని..బన్నీ కెరీర్‌ను ఈ సినిమా ఓ మలుపు తిప్పుతుందని అంటున్నాడు. బన్నీ మేనరిజం, గెటప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావడం ఖాయమంటున్నాడు.ఇక హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)నటన అద్భుతంగా ఉందని..ఏజెన్సీ వాతావరణానికి సరిగ్గా ఇమిడిపోయిందన్నాడు. ఇక కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సుకుమార్ దర్శకత్వం చాలా బాగున్నాయన్నాడు. కచ్చితంగా నేషనల్ అవార్డు గెల్చుకుంటుందంటున్నాడు. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడిగా, ప్రముఖ విశ్లేషకుడిగా ఉమైర్ సంధూ(Umair Sandhu)రివ్యూ సినీ ప్రపంచంలో కాస్త పాపులర్. ఉమైర్ సంధూ ఫస్ట్ రివ్యూ అంటే చాలా ఆసక్తి ఉంటుంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ కధాంశం నేపధ్యంలో తెరకెక్కిన పుష్పలో(Pushpa) హీరో బన్నీ..మేనరిజం, పాత్ర చాలా విభిన్నంగా ఉండనుంది. అటు కామెడీ నటుడు సునీల్ తొలిసారిగా విలన్ పాత్రలో అద్భుతంగా చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా ఓ ఎత్తైతే..రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, పాటలు సినిమాను చాలావరకూ కాసేస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే శ్రీవల్లి పాట(Srivalli Song) సృష్టిస్తున్న మేనియా ఐదు భాషల్లో అంతా ఇంతా కాదు.ఇప్పుడు సమంతా ఐటమ్ సాంగ్ ఓ ఊపు ఊపుతోంది. తెలుగులో మంగ్లీ(Singer Mangli)సోదరి ఇంద్రావతి చౌహాన్ పాటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అటు కన్నడలో ఇదే పాటను స్వయంగా మంగ్లీ పాడి ఉర్రూతలూగిస్తోంది.

Also read: Vikram Rathode Teaser: విక్రమ్ రాథోడ్ టీజర్.. మరోసారి ఆడియెన్స్ క్యూరియాసిటీ పెంచిన విజయ్ ఆంటోనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More