Home> వినోదం
Advertisement

Pushpa 2 Team Met an Accident: పుష్ప2 టీంకు షాక్.. యాక్సిడెంట్‌లో అందరికీ గాయాలు

Pushpa 2 Team Met an Accident: అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ మారెడుమిల్లిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రయూనిట్‌కు షాక్ తగిలింది. తిరిగి వస్తున్న టీంకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Pushpa 2 Team Met an Accident: పుష్ప2 టీంకు షాక్.. యాక్సిడెంట్‌లో అందరికీ గాయాలు

Pushpa 2 Team Met an Accident: అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా టీంకు ప్రమాదం జరిగింది. నేటి ఉదయం ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తున్న చిత్రయూనిట్‌కు బస్సు ప్రమాదం జరిగింది. జూ. ఆర్టిస్టులతో వస్తోన్న పుష్ప టీం ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సుతో ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. నార్కట్ పల్లిలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. గాయపడిన జూ. ఆర్టిస్టులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది.

ఇక ఇందులో ఎవ్వరికీ ఎటువంగా ప్రమాదం లేదని, చిన్న గాయాలే అయ్యాయని తెలుస్తోంది. మొన్నటి వరకు మారెడుమిల్లిలోనే చిత్రయూనిట్ అంతా కూడా ఉంది. అల్లు అర్జున్ మీద కీలక సన్నివేశాలు షూట్ చేశారని తెలుస్తోంది. ఇక అక్కడ ఈ షెడ్యూల్‌ ముగియడంతో అందరూ హైద్రాబాద్‌కు బయల్దేరినట్టుగా సమాచారం. ఇంతలోనే ఇలా ప్రమాదం జరిగింది.

ఐటీ రైడ్స్ నేపథ్యంలోనూ పుష్ప షూటింగ్‌కు కాస్త గ్యాప్ వచ్చింది. మైత్రీ కార్యాలయాల్లో సోదాలు, సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ వల్ల రెండు మూడు రోజులు షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇలా మరోసారి పుష్ప టీం వార్తల్లో నిలిచింది. నేటి ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో మరోసారి సోషల్ మీడియాలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది.

Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!

అల్లు అర్జున్ పుష్ప ది రూల్‌ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ మీద దాడి చేయబోతోన్నాడు. ఈ మేరకు పుష్ప రెండో పార్ట్ గ్లింప్స్, గంగాలమ్మ జాతరలోని లుక్‌ను రిలీజ్ చేయగా.. ఫుల్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే కాళీ మాత లుక్కులో బన్నీ కనిపించిన తీరుకి సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే పెరిగింది. బన్నీ ట్రై చేసినట్టుగానే అందరూ కూడా ఆ లుక్కుని ట్రై చేస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More