Home> వినోదం
Advertisement

Pushpa The Rule : పుష్ప ది రూల్ అప్డేట్.. షెకావత్‌ సర్‌తో షూట్ పూర్తి?

Fahadh Faasil Schedule ఫాహద్ ఫాజిల్‌కు నటుడిగా ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. సౌత్‌లో ఫాహద్ ఫుల్ బిజీగా ఉండే నటుడు. ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియన్‌ యాక్టర్‌గా మారాడు. మాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఫాహద్ ఎంట్రీ గట్టిగానే జరిగింది.

Pushpa The Rule : పుష్ప ది రూల్ అప్డేట్.. షెకావత్‌ సర్‌తో షూట్ పూర్తి?

Pushpa The Rule Shoot పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫాహద్ ఫాజిల్‌తో కీలకమైన షెడ్యూల్‌ను సుకుమార్ పూర్తి చేశారట. ఈ మేరకు అప్డేట్ వచ్చింది చిత్రయూనిట్. సెట్స్ నుంచి షెకావత్ సర్‌ను చూపించింది మైత్రీ యూనిట్. పుష్ప ది రూల్ సినిమా అంతా కూడా షెకావత్‌, పుష్ప రాజ్ మధ్యే ఉండబోతోన్నట్టుగా అర్థం అవుతోంది. ఈ ఇద్దరి ఇగోల మధ్యే సినిమా నడుస్తుందని తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ను పుష్ప రాజ్‌గా సుకుమార్ చూపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. సుకుమార్ మేకింగ్, బన్నీ యాక్టింగ్, దేవీ శ్రీ ప్రసాద్ పాటలు ఇలా అన్నీ కూడా సినిమాను హిట్ చేశారు. ఫాహద్ ఫాజిల్‌ యాక్టింగ్ కూడా సినిమాకు కలిసి వచ్చింది. మొదటి పార్ట్‌లో షెకావత్‌గా ఫాహద్ కనిపించి కొద్ది సేపే అయినా కూడా తన మార్క్ చూపించాడు. రెండో పార్ట్‌లో షెకావత్, పుష్ప రాజ్ మధ్యే ఉండేట్టుగా కనిపిస్తోంది.

బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్, అందులోని విజువల్స్, డైలాగ్స్ అన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇక అదే రోజు రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌, బన్నీ గెటప్‌ ఎంతో ట్రెండ్ అయింది. గంగమ్మ జాతరలో కాళీ మాతలా బన్నీ వేషం వేయడం అదిరిపోవడంతో.. సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి.  ఈ మధ్యే పుష్ప ది రూల్‌ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ విషయంలోనూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇంత వరకు ఏ ఇండియన్ సినిమాకు కూడా ఆ రేంజ్‌ ఆడియో రైట్స్ రాలేదని తెలుస్తోంది.

Also Read:  Akhil Agent OTT : Rajinikanth Last Movie : రజినీ లాస్ట్ సినిమా అదేనా?.. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సూపర్ స్టార్

గత నెలలో మైత్రీ కార్యాలయాలు, సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ రైడ్స్ వల్ల ఓ రెండు మూడు రోజులు షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మైత్రీ నిర్మాతలు తమ హీరోలకు హవాలా సొమ్ముని రెమ్యూనరేషన్‌గా ఇచ్చారనే టాక్ కూడా వచ్చింది.

Also Read:  Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్.. చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More