Home> వినోదం
Advertisement

Samantha and Allu Arjun: సమం‌త, అల్లు అర్జున్‌ల మధ్య ఒకరిపై మరొకరికి అంత నమ్మకమా..? ఎందుకు..?

"ఊ అంటావా మావా..ఊహూ అంటావా" పాటతో ఊ అనాల్సిందే మరో ఆప్షన్ లేదన్పించిన సమంత ఇప్పుడు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇక పుష్ప హీరో అల్లు అర్జున్ వర్సెస్ సమంతల మద్య ఒకరిపై మరొకరికి నమ్మకం పెరిగిపోతోంది.
 

Samantha and Allu Arjun: సమం‌త, అల్లు అర్జున్‌ల మధ్య ఒకరిపై మరొకరికి అంత నమ్మకమా..? ఎందుకు..?

Samantha and Allu Arjun: ఊ అంటావా మావా..ఊహూ అంటావా పాటతో ఊ అనాల్సిందే మరో ఆప్షన్ లేదన్పించిన సమంత ఇప్పుడు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇక పుష్ప హీరో అల్లు అర్జున్ వర్సెస్ సమంతల మద్య ఒకరిపై మరొకరికి నమ్మకం పెరిగిపోతోంది.

నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కెరీర్ పరంగా మంచి అవకాశాలు రావడంతో దూసుకుపోతోంది. ఇది చాలదన్నట్టు పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ సంచలనంగా మారిపోయంది. "ఊ అంటావా మావా..ఊహూ అంటావా మావతో" అందర్నీ ఊపేస్తున్న సమంత...ఆ పాటకు చేసిన డ్యాన్స్ గానీ, ప్రదర్శించిన హావభావాలు గానీ ఔరా అన్పిస్తున్నాయి. అందుకే యూట్యూబ్‌లో ఈ పాట టాప్‌లో నిలుస్తోంది. 

పుష్ప సినిమా (Pushpa Movie) థ్యాంక్స్ మీట్‌లో కూడా ఇదే పాట చర్చనీయాంశంగా మారింది. హీరో అల్లు అర్జున్, సమంతలు ఒకరిపై మరొకరు నమ్మకాల్ని నిలబెట్టుకుంటున్నారు. ఈ మీట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) సమంతపై ప్రశంసలు కురిపించాడు. స్పెషల్ సాంగ్ చేసిన సమంతకు థ్యాంక్స్. మీరు ఆ పాటను ఎంత నమ్మారో గానీ.. మేం మిమ్మల్ని ఇంతగా నమ్ముతున్నామని చెప్పే విధంగా మమ్మల్ని నమ్మారు.. మా మీద నమ్మకంతోనే ఆ పాట చేశారు. ఆ నమ్మకానికి మీకు థ్యాంక్స్. సెట్‌లో మీకు ఎన్ని అనుమానాలు వచ్చాయో నాకు తెలుసు. తప్పా - ఒప్పా అని ఆలోచించావ్! ట్రస్ట్ మీ అని చెప్పిన ఒకే ఒక మాటకు మరో ప్రశ్న వేయలేదు. ఆ పాట చేసేశావ్. అదే నా గుండెను తాకింది. ఏది అడిగినా ఆలోచించకుండా చేశావ్. అదే నీ మీద గౌరవాన్ని పెంచేసింది. ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్ నిలబడటమంటే సాధారణ విషయం కాదు. నీకు కంగ్రాట్స్ సమంత అంటూ ప్రశంసలు కురిపించాడు. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

అటు సమంత (Samantha) కూడా బన్నీ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చింది. బన్నీ వీడియోను షేర్ చేస్తూ రిప్లై ఇచ్చింది. ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను అంటూ ట్వీట్ చేసింది. ఇలా ఒకరిపై మరొకరు నమ్మకం ప్రదర్శించుకున్న సందర్భం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం మూవీ, తమిళంలో విజయ్ సేతుపతితో కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలు చేస్తున్న సమంత..డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మిస్తున్న 30వ చిత్రానికి సంతకం చేసింది. అటు మరో హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Also read: Pan India Movies: పాన్ ఇండియా పదం పుట్టిందే తెలుగు సినిమాతో..కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More