Home> వినోదం
Advertisement

Allu Arjun at India Day parade: అమెరికాలోనూ తగ్గేదేలే అనిపించిన అల్లు అర్జున్.. మామూలు క్రేజ్ కాదుగా

Allu Arjun Photos at India Day parade in New York: భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో నిర్వహించిన ఇండియా డే పరేడ్ కి అల్లు అర్జున్ గ్రాండ్  మార్షల్ గా వ్యవహరించారు.

Allu Arjun at India Day parade: అమెరికాలోనూ తగ్గేదేలే అనిపించిన అల్లు అర్జున్.. మామూలు క్రేజ్ కాదుగా

Allu Arjun Photos at India Day parade in New York: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఖ్యాతి ఖండంతరాలు దాటుతోంది.fallbacks

భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో నిర్వహించిన ఇండియా డే పరేడ్ కి అల్లు అర్జున్ గ్రాండ్  మార్షల్ గా వ్యవహరించారు. న్యూయార్క్ లో జరిగిన ర్యాలీకి న్యూయార్క్, న్యూ జెర్సీ, కనెక్టికట్ మాన్హట్టన్ సహా పలు ప్రాంతాల్లో ఉండే భారతీయులు భారీ ఎత్తున పాల్గొన్నారు.fallbacks

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించగా ఈ ర్యాలీలో హీరో అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించారు. ఆయనతో పాటు ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు.fallbacks

ఈ ప్రతిష్టాత్మక ర్యాలీకి గ్రాండ్ మార్షల్ గ వ్యవహరించడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. గ్రాండ్ మార్షల్ గా ఈ పెరేడ్ క అల్లు అర్జున్ వ్యవహరించిన నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఒక సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ అందించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్తో కలిసి తగ్గేదేలే అనే మేనరిజం కూడా చేసి చూపిస్తూ ఫోటోకి ఫోజులిచ్చారు ఆయన.fallbacks

మరోపక్క అల్లు అర్జున్ న్యూయార్క్ లో సందడి చేస్తుంటే హైదరాబాద్ లో పుష్ప సినిమా సీక్వెల్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.fallbacksAlso Read: Telugu Movie Releases: లైగర్- రిపీట్ సహా ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే!

Also Read: Karthikeya2 Collections: ఆదివారం రచ్చ రేపిన వసూళ్లు.. టోటల్ ఎన్ని కోట్లంటే?

Read More