Home> వినోదం
Advertisement

Akhanda Pre Release: ఒకే వేదికపై బాలయ్య, అల్లు అర్జున్​- ఫ్యాన్స్​కు ఇక పండగే!

Akhanda: బాలయ్య నటించి  తాజా చిత్రం 'అఖండ' థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు మెగా హీరో ముఖ్య అతిథిగా వస్తుండటం విశేషం.

Akhanda Pre Release: ఒకే వేదికపై బాలయ్య, అల్లు అర్జున్​- ఫ్యాన్స్​కు ఇక పండగే!

Allu Arjun is Chief Guest for Akhanda: నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్​లో వస్తున్న 'అఖండ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్​ల తర్వాత వీరు కాంబినేషల్​లో వస్తున్న సినిమా (Balayya boyapati movies) కాబట్టి.. ఇటు సినీ వర్గాల్లో, అటు నందమూరి అభిమానుల్లో 'అఖండ'పై భారీ అంచనాలు ఉన్నాయి.

డిసెంబర్ 2న ఈ సినిమా థియేటర్లలో (Akhanda release date) విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్లు మూవీపై హైప్​ పెంచేశాయి. బాలయ్య క్రేజ్​ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అభిమానులు బాలయ్య నుంచి కోరుకునే మాస్ డైలాగ్స్​తోపాటు.. లుక్స్​, కథ సాగుతుందని ట్రైలర్​ ద్వారా అర్థమవుతుంది.

థియేటర్లలో విడుదలకు ముందు.. ఈ నెల 27న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను ప్లాన్​ చేసింది (Akhanda Pre Releas event) చిత్ర యూనిట్​. శిల్ప కలా వేదికలో శనివారం సాయంత్రం 6 గంటలకు కి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.

నందమూరి ఫ్యాన్స్​కు ఈ ఈవెంట్ ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. ఈ సారి ఈవెంట్​కు మెగా హీరో ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఒకే స్టేజిపై బాలయ్యతో పాటు అల్లు అర్జున్(Balayya Allu Arjun on Akhanda stage) సందడి చేయనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్​ ఇటు నందమూరు అభిమానులకు, అటు మెగా ఫ్యాన్స్​కు ఫుల్​ ఎటర్​టైన్మెంట్ ఇవ్వనుంది.

అఖండ సినిమా గురించి..

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించారు. జగపతి బాబు, శ్రీకాంత్​ (విలన్​)లు కీలక పాత్రలు పోషించారు.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డిఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫి సి. రామ్​ ప్రసాద్.​

Also read: Jayasudha's Shocking Look: జయసుధ ఇంతలా రిపోయిందేంటి! చూస్తే షాక్ అవ్వాల్సిందే!!

Also read: Urfi Javed in transparent top: ట్రాన్స్‌పరెంట్ టాప్‌లో ఉర్ఫి జావేద్.. ట్రోల్స్‌కి జావేద్ సమాధానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More