Home> వినోదం
Advertisement

Allu Arjun: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీద కన్నేసిన స్టైలిష్ స్టార్.. ఆమె ఎవరో తెలుసా..!

Allu Arjun Upcomin Movies: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా లో రష్మిక మందన్న తో రొమాన్స్ చేస్తున్న బన్నీ.. నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం.. అల్లు అర్జున్ ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్.. అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. 

Allu Arjun: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీద కన్నేసిన స్టైలిష్ స్టార్.. ఆమె ఎవరో తెలుసా..!

Allu Arjun-Trivikram Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో.. పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య.. ఈ ఏడాది డిసెంబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో..సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక స్టార్ హీరోయిన్.. అయితే బాగుంటుంది అని అల్లు అర్జున్ అనుకుంటున్నారట. తెలుగు ప్రేక్షకులందరూ ఇప్పటికే ఎక్కువ సినిమాల్లో చూసిన హీరోయిన్ కాకుండా.. ఇంకెవరైనా పేరున్న హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టగా.. జాన్వీ కపూర్ పేరు బయటకు వచ్చింది. 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న జాన్వి కపూర్..ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా..దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమాలో కూడా జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. 

ఇక తెలుగులో స్టార్ హీరోలతో సినిమాల కోసం వేటలో ఉన్న జాన్వి కపూర్.. అల్లు అర్జున్ కి నో చెప్పే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ఈ సినిమా ఆఫర్ వస్తే ఆమె కచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంది. మరి అల్లు అర్జున్, జాన్వి కపూర్ ల కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి. 

మరోవైపు నిన్న మొన్నటిదాకా హోల్డ్ లో.. ఉన్న పుష్ప 2 షూటింగ్ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More