Home> వినోదం
Advertisement

Allari Naresh Movie: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఓటీటీ విడుదల, ఎప్పుడు ఎందులో

Allari Naresh Movie: అల్లరి నరేష్ తిరిగి పుంజుకుంటున్నాడు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. అలాంటి సినిమానే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఆ వివరాలు మీ కోసం..

Allari Naresh Movie: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఓటీటీ విడుదల, ఎప్పుడు ఎందులో

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ పరిచయం అవసరం లేని పేరు. మొన్నటి వరకూ సరైన హిట్ లేక కనుమరుగైన స్థితి నుంచి ఒక్కసారిగా ఊపందుకున్నాడు. ఇటీవల విడుదలైన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

నాంది సినిమాతో తానేంటో మరోసారి రుజువు చేసుకుని సినిమా అవకాశాల్ని మళ్లీ చేజిక్కించుకుంటున్నాడు అల్లరి నరేష్. నటనకు ప్రాధాన్యత కలిగిన నాందీ సినిమా తరువాత ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ సినిమాలో నరేష్ కమర్షియల్ హంగులకు దూరంగా ఉన్నాడు. నవంబర్ 25న ధియేటర్‌లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నరేష్..ఎన్నికల విధులు నిర్వహించే ఓ అధికారిగా అద్భుత నటన కనబరిచాడు. రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రశ్నించడమే ఈ సినిమా కాన్సెప్ట్. 

వాస్తవానికి ఈ సినిమా ఓటీటీ విడుదల 2023 అంటే వచ్చే ఏడాదిలో జనవరి నెలలో చేయాలని భావించినా..ఇప్పుడు త్వరగా విడుదల చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన జీ5లో స్ట్రీమింగ్ కానుంది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా.

Also read: Bigg Boss Samrat Love Stories : సామ్రాట్ లిఖితల గుట్టు లాగే ప్రయత్నం.. పెళ్లికి ముందు లవ్ స్టోరీలపై సుమ ప్రశ్నలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More