Home> వినోదం
Advertisement

Salaar: సలార్ చిత్రం మిస్ చేసుకున్న హీరోయిన్... ఫైనల్ గా ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్

Salaar Collections: ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా మన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మేనియా నడుస్తోంది. ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ రావాలి అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానులు.. ఎట్టకేలకు సలార్ రూపంలో తమ డార్లింగ్ కు సూపర్ డూపర్ సక్సెస్ రావడంతో ఆనందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది..
 

Salaar: సలార్ చిత్రం మిస్ చేసుకున్న హీరోయిన్... ఫైనల్ గా ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్

Salaar Actress: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సలార్ మానియా రన్ అవుతోంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ప్రభాస్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని తెలియజేస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు కీలక పాత్రలో కనిపించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. అయితే ఈ చిత్రంలో ఏ పాత్రని కూడా దర్శకుడు అవసరం లేకుండా పెట్టారు అని ప్రేక్షకులకు అనిపివ్వదు. ఎందుకంటే ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్ కథకు ఏదో ఒకరకంగా పనికొచ్చే విధంగానే కనిపిస్తుంది. ఇక ఈ చిత్ర ట్రైలర్ విడుదలైనప్పుడు ఈ సినిమాల్లో శృతిహాసన్ పాత్ర ఏమి ఉండదు కేవలం ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి దర్శకుడు పెట్టారు అని కామెంట్లు వినిపించాయి. కాగా సలార్ సినిమాలో శృతిహాసన్ కనిపించింది కొన్ని సన్నివేశాలే అయినా ఈ కథ మొత్తం ఆమె దగ్గర నుంచే మొదలవుతుంది. ఇక దీంతో ప్రశాంత్ నీల్ శృతిహాసన్ కూడా అనవసరంగా పెట్టలేదని ఈ చిత్రం చూసిన వారందరికీ అర్థమైంది.

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే డైరెక్టర్ ఈ చిత్రానికి ముందుగా హీరోయిన్ గా అనుకుంది శృతిహాసన్ ని కాదట. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ వైపు పరుగులు తీస్తున్న సలార్ సినిమాని మిస్ చేసుకుని బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. మరెవరో కాదు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.

రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ కి ఈ మధ్యనే నేషనల్ అవార్డు వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిన విషయమే. ఇక బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయిన ఆలియాభట్ మన తెలుగు ప్రేక్షకులకు ఆర్.ఆర్.ఆర్ అలానే బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించి మెప్పించింది. ఇక మొదటి సలార్ మూవీ కోసం ఈ అందాల భామను అనుకున్నారట మేకర్స్. ఇదే విషయాన్ని స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి మరి ప్రశాంత్ నీల్ అడిగారని టాక్.

కానీ ఆలియాభట్ ఎందుకు ఈ సినిమాలో నటించడానికి సముఖత చూపలేదు అని తెలుస్తుంది. తన డేట్స్ కుదరకపోవడం కారణమా.. లేదా ప్రభాస్ గత చిత్రాలు ఫ్లాప్ అవ్వడం కారణమా తెలియదు కానీ.. మొత్తానికి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మాత్రం ఆలియా మిస్ చేసుకుంది. దీంతో శృతిహాసన్ ఈ మూవీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ

Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Read More