Home> వినోదం
Advertisement

Nagarjuna vs Amala: పోటాపోటీగా అమల-నాగార్జున సినిమాలు రిలీజ్!

Akkineni Nagarjuna Brahmastra and Amala oke oka jeevitham Releasing on Same Day: నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మాస్త్రం సినిమా ఇదే రోజు విడుదలవగా అమల కీలక పాత్రలో నటించిన ఒకే ఒక జీవితం సినిమా కూడా విడుదలైంది.

Nagarjuna vs Amala: పోటాపోటీగా అమల-నాగార్జున సినిమాలు రిలీజ్!

Akkineni Nagarjuna Brahmastra and Amala oke oka jeevitham Releasing on Same Day: చాలా కాలం నుంచి బాలీవుడ్ దర్శక నిర్మాతలు బాహుబలి లాంటి ఒక బడా బ్లాక్ బస్టర్ మూవీ అందుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి సినిమాలు చేశారు. కానీ అవి ఏవీ వర్కౌట్ అవలేదు. తాజాగా సుమారు 410 కోట్ల రూపాయల బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర అనే సినిమాను రూపొందించారు. రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో షారుక్ ఖాన్, అమితాబచ్చన్, నాగార్జున, మౌని రాయ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా కరణ్ జోహార్ సహా రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ వంటి వారు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. నాలుగు బడా ప్రొడక్షన్ సంస్థలు కూడా సినిమా నిర్మాణంలో భాగమయ్యాయి. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలవుతుంది. దక్షిణాది భాషలలో రాజమౌళి విడుదల చేస్తుండడంతో సినిమా మీద ఆసక్తి పెరిగింది.  ఇక అసలు విషయం ఏమిటంటే అక్కినేని నాగార్జున అక్కినేని అమల ప్రేమించి వివాహం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే.

అయితే నాగార్జునతో వివాహం జరిగిన తర్వాత అమల సినిమాల్లో నటించడం పూర్తిగా మానేశారు. ఈ మధ్యనే సినీ రీ ఎంట్రీ ఇచ్చిన అమల అమ్మ పాత్రల లో నటించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఆమె అలాగా నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక తాజాగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అది ఏమిటి అంటే నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మాస్త్రం సినిమా ఇదే రోజు విడుదలవగా అమల కీలక పాత్రలో నటించిన ఒకే ఒక జీవితం సినిమా కూడా విడుదలైంది.

బ్రహ్మాస్త్ర సినిమాలో నంది అస్త్రాన్ని కలిగి ఉన్న ఒక వ్యక్తిగా నాగార్జున కనిపించబోతున్నారు. అలాగే శర్వానంద్ తల్లి పాత్రలో ఒకే ఒక జీవితం సినిమాలో అక్కినేని అమల కనిపిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు బాయ్ కాట్ ట్రెండు గట్టిగా ప్రభావం చూపే అవకాశాలు ఉండగా ఒకే ఒక జీవితం సినిమాకు మాత్రం పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. తెలుగు మీడియా ప్రతినిధుల కోసం ఎనిమిదో తారీకు రాత్రి స్పెషల్ షో వేశారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో విమర్శకుల నుంచి సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే బ్రహ్మాస్త్ర సినిమా మాత్రం ఎలా ఉండబోతోంది అనేది చూడాలి. 

Also Read: 'Oke Oka Jeevitham' Review: ఇంటరెస్టింగ్ గా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' రివ్యూ

Also Read: Samantha Special Pooja: సమంత ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More