Home> వినోదం
Advertisement

Naga Chaitanya viral Video : డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటోన్న చై.. సోషల్ మీడియాలో వీడియోల హల్‌చల్

Naga Chaitanya Video viral : వైరల్ అవుతోన్న అక్కినేని నాగ చైతన్య వీడియో. చైతన్య సిగ్గుపడుతూ ఇచ్చిన రియాక్షన్‌ వీడియోతో పాటు మరో కొత్త వీడియో సోషల్‌ మీడియాలో వైరల్. డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటోన్న చై.

Naga Chaitanya viral Video : డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటోన్న చై.. సోషల్ మీడియాలో వీడియోల హల్‌చల్

Akkineni Naga Chaitanya Sings Don’t Marry Be Happy Video viral : అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నప్పటి నుంచి వారిద్దరికి సంబంధించిన ప్రతి విషయం సోషల్‌ మీడియాలో (Social media) ట్రెండ్ అవుతోంది. ఒకవైపు సామ్‌ సోషల్ మీడియాలో చేసే పోస్టులు వైరల్ (Viral) అవుతుండగా.. మరోవైపు చైకి సంబంధించిన పలు వీడియోలు (Videos) సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. 

ఈ క్రమంలో తాజాగా నటి దక్ష నాగార్కర్‌ (Daksha Nagarkar) చిలిపి చేష్టలకు నాగ చైతన్య సిగ్గుపడుతూ ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా (Hot topic) మారింది. ఇది ఇలా ఉండగా చైకి సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

తాజాగా నాగ చైతన్య తన తండ్రి నాగార్జున (Nagarjuna) మన్మథుడు మూవీలోని డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ సాంగ్ (Don’t Marry Be Happy song) పాడారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో దూసుకెళ్తోంది. నాగార్జున, నాగ చైతన్య ప్రస్తుతం బంగార్రాజు మూవీ ప్రమోషన్స్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. 

ఈ ప్రమోషన్స్‌లో భాగంగా నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి జీ తెలుగు (ZEE TELUGU) ఛానల్ నిర్వహించిన షోలో పాల్గొన్నారు. కేరళలో సంక్రాంతి అల్లుళ్ల సందడి, బంగార్రాజుతో (Bangarraju team) సంక్రాంతి సంబరాలు అంటూ ఈ షోకు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు ఛానల్ (Zee Telugu) యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది. 

 

అయితే ఈ సంక్రాంతి స్పెషల్ షో ప్రోమోలో నాగ చైతన్య మస్తు సందడి చేశారు. ఈ ప్రోమో వీడియోలో నాగ చైతన్య వద్దురా సోదరా... పెళ్లంటే నూరేళ్ల మంటరా.. డోంట్ మ్యారీ... బీ హ్యాపీ అనే సాంగ్‌ హమ్ చేశారు. 

Also Read : Pandem Kollu: సంక్రాంతికి సిద్ధమైన పందెం కోళ్లు..ఒక్కొక్కటి లక్ష వరకూ ధర

ఇక ఇప్పుడు చైతు పాడిన ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమంతతో విడాకులు తీసుకున్న నేపథ్యంలో.. చై నోటి వెంట.. డోంట్ మ్యారీ… బీ హ్యాపీ అని రావడమే (Naga Chaitanya Sings Don’t Marry Be Happy) ఇందుకు కారణం. ఈ షోలో చై ఈ పాటతో మరికొన్ని పాటలకు కూడా హమ్ చేశారు. ఇక నాగార్జున, నాగ చైతన్యల బంగార్రాజు (Bangarraju) sమూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read : ఆగని సినిమా టికెట్ల వార్.. తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More