Home> వినోదం
Advertisement

Akhil Akkineni: అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి అప్ డేట్..‘లెహరాయి’ సాంగ్ ప్రోమో విడుదల

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. సోమవారం ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘లెహరాయి..’ ప్రోమో విడుదలైంది.

Akhil Akkineni: అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి అప్ డేట్..‘లెహరాయి’ సాంగ్ ప్రోమో విడుదల

Leharaayi song promo released: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’(Most Eligible Bachelor). బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకుడు. ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై రూపొందుతోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ లెహరాయి ప్రోమో(Leharaayi song promo released) విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి’ అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. సెప్టెంబర్ 15న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు విడుదలైన ప్రోమోలో అఖిల్(Akhil), పూజ(Pooja Hegde) రొమాన్స్ అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్(Aditya Music) ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

చిన్న వయస్సులోనే 'సిసింద్రీ’ సినిమాతో టాలీవుడ్‌ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్(Akhil Akkineni). ఇక తన పేరుతోనే రూపొందిన ‘అఖిల్’ అనే సినిమాతో ఆయన హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మరో ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సినిమాల్లో నటించిన ఆయనకు సరైన సక్సెస్ లభించలేదు.  ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’(Most Eligible Bachelor) అనే సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More