Home> వినోదం
Advertisement

Akhanda 2: అఖండ 2లో మరోసారి బాలయ్య సరసన ఆ క్రేజీ బాలీవుడ్ భామ.. !

BB4 - Balakrishna - Boyapati Sreenu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. వీళ్ల కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇపుడు నాల్గో  చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో చాలా యేళ్ల తర్వాత బాలీవుడ్ క్రేజీ భామ బాలయ్య సరసన నటించబోతున్నట్టు సమాచారం.

Akhanda 2: అఖండ 2లో మరోసారి బాలయ్య సరసన ఆ క్రేజీ బాలీవుడ్ భామ.. !

BB4 - Balakrishna - Boyapati Sreenu:  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, డైరెక్టర్  కాంబినేషన్స్ లో సినిమా వస్తుందంటే.. ఆడియన్స్ కూడా ఆ కాంబోలో   సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. గత కొన్ని యేళ్లతో  బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు  ట్యూన్ అయిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది బోయపాటి శ్రీను అని చెప్పాలి. అంతేకాదు ఈ నందమూరి నాయకుడిలోని  మైనస్ ను పక్కనపెట్టి.. కేవలం ప్లస్ పాయింట్స్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు బాలయ్యతో ఎలాంటి స్టోరీతో తో సినిమా తెరకెక్కిస్తే ఆడియన్స్ పల్స్ పట్టుకోవచ్చనేది బోయపాటికి తెలిసిపోయింది. వీళ్ల కాంబినేషన్ లో  సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్  హిట్స్ తర్వాత నాల్గోసారి చేతులు కలిపారు. BB4 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా అఖండ కు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు.  

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ, రైటింగ్ అన్ని పూర్తయ్యాయి. బాబీ సినిమా తర్వాత BB4 కాంబినేషన్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
అఖండలో చిన్న పాపకు ఇచ్చిన మాట కోసం మళ్లీ రావడం వంటి కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. మరోసారి అఘోరా పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కత్రినా కైఫ్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అపుడెపుడో ‘అల్లరి పిడుగు’ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించారు.

ఆ సినిమా తర్వాత మరే తెలుగు సినిమాలో నటించలేదు. ఇపుడు చాన్నాళ్ల తర్వాత బాలయ్య సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆమె పాత్రతో పాటు రెమ్యునరేషన్ బాగుండటంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అఖండ 2లో   ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే  సన్నివేశాల్లో  బాలయ్య ఓల్డ్ గెటప్‌ లో కనిపించబోతున్నట్టు సమాచారం.  అది  కూడా సాధువుగా కనిపించనున్నాడు.  ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన మొత్తం  స్కెచ్ రెడీ చేసాడట బోయపాటి శ్రీను. ఇప్పటికే బాలయ్యపై  ఈ క్యారెక్టర్ కు  సంబంధించి టెస్ట్ షూట్ కూడా చేసారట. ఈ సినిమాను పూర్తిగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో  'అఖండ'ను మించి రీతిలో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడట.

ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడట.  ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న సంజయ్ దత్.. ఇపుడు బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడట.
 ‘అఖండ 2’ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారి బాలయ్య కూతురు తేజస్వీ  ప్రొడ్యూసర్ గా  సినీ రంగ ప్రవేశం చేయబోతుంది. ఈ చిత్రానికి తేజస్వి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది.  మరి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 109 సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అది కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More