Home> వినోదం
Advertisement

Adipurush: సైఫ్ అలీ ఖాన్ రావణుడి వేషం వెనుకున్నది ఎవరో తెలుసా ?

Prabhas నటించనున్న అప్‌కమింగ్ సినిమాల్లో ఒకటైన ఆదిపురుష్‌లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో ( Saif Ali Khan as Ravan ) విలన్‌గా కనిపించనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Adipurush: సైఫ్ అలీ ఖాన్ రావణుడి వేషం వెనుకున్నది ఎవరో తెలుసా ?

Prabhas నటించనున్న అప్‌కమింగ్ సినిమాల్లో ఒకటైన ఆదిపురుష్‌లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో ( Saif Ali Khan as Ravan ) విలన్‌గా కనిపించనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్‌ని రావణుడి పాత్రకు తీసుకున్నట్టు వెల్లడించారో.. అప్పటి నుంచే మూవీ యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొంతమంది అభిమానులు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఐతే ఇంతకూ సైఫ్ అలీ ఖాన్‌ని రావణుడిగా తీసుకోవాలన్న ఆలోచన ఎవరిది ? అసలు ఆ పాత్ర కోసం ఇంకెవరినైనా ఆశ్రయించారా అనే వివరాలు ఆరా తీసినప్పుడు బాలీవుడ్ మీడియాలో ఓ టాక్ వినిపించింది. Also read : V Movie: సుధీర్ బాబు ఫిట్‌నెస్‌పై ఇన్‌స్పైరింగ్ వీడియో

Adipurush movieలో రావణుడి పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అవును.. ఆ చిత్ర దర్శకుడు ఓం రావత్ ( Om Raut ) వెళ్లి రావణుడి పాత్ర చేయాల్సిందిగా కోరుతూ అజయ్ దేవగన్‌ని ( Ajay Devgn ) కలిశాడట. అప్పటికే ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తన్హాజి చిత్రం ( Tanhaji movie ) సూపర్ హిట్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ చనువుతోనే అజయ్ దేవగన్ భారీ ఎత్తు కలిగిన పర్సనాలిటీ అనే ఉద్దేశంతో ఓం రావత్ వెళ్లి అజయ్‌ని కలిశాడట. కానీ ఆదిపురుష్ మూవీలో రావణుడి పాత్ర చేయడం ఇష్టం లేని అజయ్ దేవ్‌గన్.. అదే విషయాన్ని ఓం రావత్‌కి చెప్పాడట. అంతేకాకుండా ప్రస్తుతానికి తన వద్ద డేట్స్ అడ్జస్ట్ చేయడం కూడా కష్టమేనని చెప్పిన అజయ్ దేవ్‌గన్.. ఆ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్‌ని ( Saif Ali Khan ) రిక్వెస్ట్ చేయొచ్చుగా అని సూచించాడట. Also read : F3 Movie: F3 మూవీ ఎక్కడివరకు వచ్చింది ? లేటెస్ట్ అప్‌డేట్స్..

అజయ్ దేవ్ గన్ హీరోగా ఓం రావత్ డైరెక్ట్ చేసిన తన్హాజీ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించాడు. అలా అప్పటికే సైఫ్‌తో ఉన్న అనుబంధం, చనువుతో వెళ్లి సైఫ్‌ని కలవడం.. అతడు రావత్‌కి ఓకే చెప్పడం వెనువెంటనే జరిగిపోయాయని బాలీవుడ్ మీడియాలో ( Bollywood ) వార్తలొస్తున్నాయి. Also read : Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1,40,640 ఉద్యోగాలు

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..

Read More