Home> వినోదం
Advertisement

Aishwarya Rai notice: ఐశ్వర్యా రాయ్ కి షాకిచ్చిన అధికారులు.. కోట్లున్నా 20 వేలు కట్టలేరా?

Aishwarya Rai Bachchan Notices: ఐశ్వర్యా రాయ్ కు నాసిక్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసిన అంశం హాట్ టాపిక్ అయింది.అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
 

Aishwarya Rai notice: ఐశ్వర్యా రాయ్ కి షాకిచ్చిన అధికారులు.. కోట్లున్నా 20 వేలు కట్టలేరా?

Aishwarya Rai Bachchan Notices: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన అద్భుతమైన నటన తనకు మాత్రమే ఉన్న అందంతో ఇంకా లైమ్‌లైట్‌లో కొనసాగుతోంది. ఈ మధ్యనే పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో నందిని అనే పాత్రతో ప్రేక్షకులను అలరించిన ఆమె ఇప్పుడు మరో సారి వార్తల్లోకి ఎక్కింది. అయితే అది వేరే విషయంలో, అసలు సంగతి ఏంటంటే ఆమె పన్ను బకాయి కట్టని కారణంగా ఐశ్వర్యరాయ్ పేరు హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది.

మీడియా నివేదికల ప్రకారం,  ఐశ్వర్య రాయ్ కి నాసిక్‌లోని సిన్నార్‌లోని అవడీ ప్రాంతంలో ఒక ఎకరా భూమి ఉంది. అయితే ఆమె ఒక సంవత్సరం పాటు పన్నును రెవెన్యూ అధికారులకు కట్ట లేదు. ఈ క్రమంలోనే ఆమెకు జనవరి 9న నోటీసులు పంపారు. ఐశ్వర్య భూమి పన్ను రూ.21,960 కాగా, ఆమె ఇప్పటికీ ఆ అమౌంట్ డిపాజిట్ చేయలేదని అంటున్నారు. ఈ పన్ను బకాయి కారణంగానే జనవరి 9న ఐశ్వర్యకు  తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు.

అయితే నిజానికి ఐశ్వర్యతో పాటు మరో 1200 మంది ఆస్తి యజమానులకు కూడా పన్ను బకాయిల కోసం నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది. నిజానికి మీడియా కథనాల ప్రకారం, ఐశ్వర్య రాయ్ బచ్చన్ 776 కోట్ల రూపాయల ఆస్తికి యజమాని. ఆమె ఒక్కో సినిమాకి 10 నుంచి 12 కోట్లు తీసుకుంటుందట. కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాదు ఆమెకు అనేక వ్యాపారాలు, ఆస్తులు, వాహనాలు కూడా ఉన్నాయి.

అలాగే  ఐశ్వర్య అనేక బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు, ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సంవత్సరానికి 80 నుండి 90 కోట్ల వరకు సంపాదిస్తుందని అంటున్నారు. అలా అన్ని కోట్లున్నా ఆమె 20 వేలు కట్టలేరా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేయడంతో ఆమె వీలైనంత త్వరలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐశ్వర్య రాయ్ ఈ బకాయి పన్ను చెల్లించడంలో జాప్యం చేస్తే, ఆమెపై రెవిన్యూ శాఖ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Also Read: Veera Simha Reddy Collection : కలెక్షన్లలో నిజమెంత ఉంది.. వీరయ్య, వీర వసూళ్ల పోస్టర్ల మీద చర్చలు

Also Read: Sunny Leone: సన్నీ లియోన్ పెదవికి గాయం!.. కావడానికి ఇదే కారణమా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 
Read More