Home> వినోదం
Advertisement

Aha Naa Pellanta on Zee 5: అలనాటి సూపర్ హిట్ టైటిల్ తో వచ్చేస్తున్న రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Aha Naa Pellanta Web Series on Zee 5: రాజ్ తరుణ్ హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా రూపొందుతున్న అహ నా పెళ్ళంట నవంబర్ 17 నుంచి జీ 5 యాప్ లో స్ట్రీమ్ కాబోతుంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే 

Aha Naa Pellanta on Zee 5: అలనాటి సూపర్ హిట్ టైటిల్ తో వచ్చేస్తున్న రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Aha Naa Pellanta Web Series to Stream on Zee 5: సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ ఎలా అయినా హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా కలిసి వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇప్పటికే అటు తమిళ సినిమాల్లో నటిస్తున్న ఆమె వెబ్ సిరీస్ అవకాశం వచ్చినా వదులు కోవడం లేదు. ఈ నేపద్యంలో ఆహ నా పెళ్ళంట అనే ఒక వెబ్ సిరీస్ రూపొందింది.

రాజ్ తరుణ్ హీరోగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో హర్షవర్ధన్, ఆమని, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను వంటి వారి కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమ్ కాబోతోంది. అయితే ఈ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి హలో హలో అని ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సింగిల్స్ అందరికీ అలాగే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్లందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సాంగ్ సాగింది.

ఇక కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్, టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవి ఈ వెబ్ సిరీస్ మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇక ఈ వెబ్ సిరీస్ లో రఘు కారుమంచి, మధునందన్, కృతికా సింగ్, తాగుబోతు రమేష్, గెటప్ శీను, భద్రం, త్రిశూల్, దొరబాబు, వరంగల్ వందన, రాకేష్ రాచకొండ వంటి వారు కనిపించనున్నారు. ఏబిసిడి సినిమా దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. తామాడ మీడియా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించింది కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ అందించిన ఈ వెబ్ సిరీస్ కి కృష్ణ తేజస్వి తన గాత్రం అందించారు.

Also Read: Chiru Vs Balayya: అడకత్తెరలో పోక చెక్కలా మైత్రీ సంస్థ.. ఇద్దరు హీరోల మధ్య సతమతం!

Also Read: Ori Devuda in OTT: ఆహాలో ఓరి దేవుడా.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More