Home> వినోదం
Advertisement

HIT 2 Twitter Review : హిట్‌ 2 ట్విట్టర్ రివ్యూ.. కచ్చితంగా హిట్టే.. ట్విస్ట్ రివీల్

HIT 2 Movie Twitter Review నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా హిట్ 2 మూవీ నేడు (డిసెంబర్ 2) థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మెయిన్ విలన్ ఎవరు? అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

HIT 2 Twitter Review : హిట్‌ 2 ట్విట్టర్ రివ్యూ.. కచ్చితంగా హిట్టే.. ట్విస్ట్ రివీల్

HIT 2 Movie Twitter Review  అడివి శేష్‌ హీరోగా, నాని నిర్మాతగా, శైలేష్‌ కొలను దర్శకుడిగా హిట్ 2  చిత్రం నేడు (డిసెంబర్ 2) విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి కూడా టాక్ కూడా వచ్చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. దీంతో హిట్ సెకండ్ కేస్ గురించి ఇప్పుడు ట్విట్టర్‌లో చర్చ నడుస్తోంది. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ స్టోరీలకు ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద దెబ్బలా మారింది.

ఎందుకంటే ఆ సస్పెన్స్ ఏంటి? థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ట్విస్టులు ఏంటి? అనేది ముందే సోషల్ మీడియాలో లీక్ అవుతుంది. దీంతో స్పాయిలర్స్ చేసే వాటితో మిగతా ఆడియెన్స్‌కు ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఇదే విషయాన్ని నిన్న నాని, అడివి శేష్‌లు చెప్పారు. దయచేసి స్పాయిలర్స్ ఎవ్వరూ కూడా ట్విస్టులను రివీల్ చేయకండని వేడుకున్నారు.

 

మరి సినిమాను చూసిన జనాలు మాత్రం హిట్ సెకండ్ కేస్ మీద మరీ అంచనాలతో వెళ్లకండని అంటున్నారు. మొదటి పార్ట్ నచ్చిన వాళ్లకి ఇది కూడా నచ్చుతుందని అంటున్నారు. మరీ హై ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్తే డిసప్పాయింట్ అవుతారు అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పర్లేదని చెబుతున్నారు.

 

గుడ్ థ్రిల్లర్ అని ఇంకొకరు.. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉన్నా.. ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయిందని, శేష్‌ ఇది వరకు చేసిన ది బెస్ట్ కారెక్టర్ ఇదేనంటూ జనాలు ట్వీట్లు పెడుతున్నారు. మూడో పార్ట్‌లో నాని పోలీస్‌గా నటించబోతోన్నాడు అని చెప్పేశారు. దీంతో జనాలు కూడా మూడో పార్ట్ మీద ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

 

నాని మూడో పార్ట్ చేస్తాడనే ట్విస్ట్ రివీల్ అయింది. కానీ మెయిన్ విలన్ అన్నది ఎవరో ఇంకా తెలియడం లేదు. ఇక మొదటి పార్టే బాగుందని, రెండో పార్ట్ అంత గ్రిప్పింగ్‌గా లేదని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి హిట్ సెకండ్ కేస్ మాత్రం ఏ ఒక్కరినీ నిరాశపర్చలేదనిపిస్తోంది. ఇక మూడో పార్ట్‌లో నాని ఎలాంటి కేస్‌ను సాల్వ్ చేస్తాడా? అని జనాలు అనుకుంటున్నారు.

Also Read : Matti Kusthi Telugu Movie Review : మట్టి కుస్తీ రివ్యూ.. సరదాగా సాగే భార్యాభర్తల పోటీ

Also Read : Shraddha Murder: అఫ్తాబ్ మెడకు ఉచ్చు.. నార్కో అనాలిసిస్ లో సంచలన విషయాలు వెలుగులోకి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More