Home> వినోదం
Advertisement

Adiparvam Censor Talk Review: మంచు లక్ష్మి 'ఆదిపర్వం' సెన్సార్ టాక్ రివ్యూ.. ఎలా ఉందంటే..

Adiparvam Censor Talk Review: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. ప్యాన్ ఇండియా భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

Adiparvam Censor Talk Review: మంచు లక్ష్మి 'ఆదిపర్వం' సెన్సార్ టాక్ రివ్యూ.. ఎలా ఉందంటే..

Adiparvam Censor Talk Review: 'ఆదిపర్వం' ఇది ఎనిమిది వందల యేళ్ల క్రితం  తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అక్కడ కొలువై ఉన్న అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథతో తెరకెక్కిందే ఆదిపర్వం మూవీ. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి అద్భుతంగా తెరకెక్కించాడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెలుగు - కన్నడ - హిందీ - తమిళ - మలయాళ సహా ఐదు భాషల్లో ఈ సినిమా తెరకెక్కించారు. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసారు సెన్సార్ సభ్యులు. అంతేకాదు ఈ సినిమా చూసి చిత్రంపై ప్రత్యేక ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ పాటలు "అన్విక ఆడియో" ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్నారు.

దాదాపు మంచు లక్ష్మీ విషయానికొస్తే.. మోహన్ బాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు సినిమాల్లో కీలక పాత్రలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా అలరిస్తోంది. తాజాగా 'ఆదిపర్వం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ...ప్యాన్ ఇండియా లెవల్లో  'ఆదిపర్వం' అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణంగా మంచు లక్ష్మి. ట్రైలర్‌కు వస్తోన్న రెస్పాన్స్‌తో పాటు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేది  అనౌన్స్ చేస్తాము.
    
ఈ సినిమాలో మంచులక్ష్మీతో పాటు  శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీ జోష్, సమ్మెట గాంధీ, యోగి కత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

టెక్నికల్ విషయానికొస్తే..
సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్, ఆర్ట్ : కేవీ రమణ, మ్యూజిక్: మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి - బి.సుల్తాన్ వలి - ఓపెన్ బనానా - లుబెక్ లీ మార్విన్, సాహిత్యం: సాగర్ నారాయణ్ - రాజాపురం శ్రీనాథ్ - ఊటుకూరు రంగారావు - మనేకుర్తి మల్లికార్జున - రాజ్ కుమార్ సిరా,  ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి, ఫైట్స్: నటరాజ్, కొరియోగ్రఫీ: సన్ రేస్ మాస్టర్, నిర్మాత: ఎమ్.ఎస్.కె. రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.

Also read: Samsung Galaxy Z Flip: శాంసంగ్ నుంచి 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్‌తో Samsung Galaxy Z Flip 6 ఫోల్డబుల్ ఫోన్ త్వరలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More