Home> వినోదం
Advertisement

Samantha Workout Video Viral: హెవీ వెయిట్‌లను ఈజీగా ఎత్తేస్తున్న సమంత, వీడియో వైరల్

Samantha Workout video viral: చైతూతో విడాకుల అనంతరం సమంత ఫుల్ బిజీగా మారింది. గత కొంతకాలంగా సమంత ఫిట్‌నెస్ పై దృష్టి సారించింది. తాజాగా సమంత వర్కౌట్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంంది.  
 

Samantha Workout Video Viral: హెవీ వెయిట్‌లను ఈజీగా ఎత్తేస్తున్న సమంత, వీడియో వైరల్

Samantha Workout video viral: టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Actress Samantha) ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్ లో తెగ వర్కౌట్ చేస్తూ ఉంటుంది సామ్. ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అప్పడప్పుడూ ఈ కసరత్తులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సమంత వర్కౌట్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ (Samantha Workout video viral) అవుతోంది. ఈ వీడియోలో టైట్ ఫిట్ డ్రైస్ వేసుకుని.. హెవీవెయిట్‌లను సైతం అమాంతంగా ఎత్తేస్తోంది. సమంత ఫిట్ నెస్ చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. 

చైతూతో విడాకుల అనంతరం సమంత సినిమాలతో పుల్ బిజీ అయిపోయింది. పుష్ప మూవీలోని ఐటెం సాంగ్ తో విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది సామ్. అంతేకాకుండా ఫ్యామిలీ మ్యాన్ 2లో తన నటనతో బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. యాడ్స్ చేస్తూనే.. సినిమాల్లోనూ బిజీగా మారిపోయింది ఈ అమ్మడు. తెలుగు, హిందీ భాషలతో పాటు పలు ఇతర భాష చిత్రాల్లోనూ నటిస్తోంది సమంత.

సమంతపై సోషల్ మీడియాలో (Social Media) ఎన్నో ట్రోల్స్ వస్తుంటాయి. ఎన్ని ట్రోల్స్, రూమర్స్ వచ్చినా తనదైన శైలిలో సమాధానం చెప్తూ దుసుకుపోతుంది సమంత. సామ్ ప్రస్తుతం 'శాకుంతలం', 'యశోద' అనే రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు రాజ్ అండ్ డికె ప్రాజెక్టులో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేస్తోంది. 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. 

Also Read: Vijay Beast: విజయ్ 'బీస్ట్' ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ వచ్చేసింది... స్ట్రీమింగ్ ఎప్పుడంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More