Home> వినోదం
Advertisement

Kiara Advani: ఆరోజు చావుని చాలా దగ్గర నుంచి చూశా..: కియారా అద్వాణీ

Kiara Advani: 'భూల్​ భులయ్యా 2' సినిమా విజయంతో మాంచి జోష్ ఉంది కియారా అద్వాణీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ... ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకోనుంది.
 

Kiara Advani: ఆరోజు చావుని చాలా దగ్గర నుంచి చూశా..: కియారా అద్వాణీ

Kiara Advani: కార్తీక్ ఆర్యన్​, కియరా అద్వానీ,  టబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భూల్​ భులయ్యా 2' (BHOOL BHULAIYAA 2). హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం 'భూల్​ భులయ్యా'  సినిమాకు సీక్వెల్​గా రూపొందింది. ఈ సినిమా విజయంతో మాంచి జోష్ లో ఉన్న కియారా (Kiara Advani) .. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.  

'దెయ్యాలంటే భయమా?' అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. 'నాకు భయం లేదు. కానీ దెయ్యం మూవీస్ చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే పడుకున్నప్పుడు భయపడతాను. అందుకే ఆ జోనర్​ సినిమాల జోలికి వెళ్లను.' అంటూ చెప్పుకొచ్చింది కియరా. అనంతరం తన కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ.  

''కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్​తో కలిసి ధర్మశాల టూర్‌ వెళ్లాను. మంచు ఎక్కువగా కురువడంతో నాలుగురోజులపాటు మేం హోటల్‌ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు రూమ్‌లో కరెంట్‌ లేదు. తాగటానికి మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడి కోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగో రోజు రాత్రి రూమ్‌లో అందరం నిద్రిస్తున్న సమయంలో మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా స్నేహితురాలు మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసిన భావన కలిగింది. అదృష్టం కొద్దీ మేమంతా బతికి బయటపడ్డాం" అని కియారా తెలిపింది. 

Also Read: Samantha Hot Pics: బ్లాక్ బ్రా లో మైండ్ బ్లాక్ చేసిన సమంత.. 'హాటీ' అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More