Home> వినోదం
Advertisement

Kajal Aggarwal: వైభవంగా కాజల్‌ అగర్వాల్‌ సీమంతం, ఫోటోలు వైరల్

Kajal Aggarwal: టాలీవుడ్ నటి కాజల్‌ అగర్వాల్‌ మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాజాగా ఆమె సీమంతం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Kajal Aggarwal: వైభవంగా కాజల్‌ అగర్వాల్‌ సీమంతం, ఫోటోలు వైరల్

Kajal Aggarwal Pics Viral: టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.  ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో కాజల్ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫోటోలను కాజల్ తన ఇన్ స్టా స్టోరీస్ లో (insta stories) పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  కాజల్‌.. వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును (gautam kitchlu) 2020 అక్టోబరులో పెళ్లి చేసుకుంది. 

2007లో 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాజల్  అగర్వాల్. చందమామ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. 2009లో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ హిట్ సాధించడంతో.. ఒక్కసారిగా టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది కాజల్. ఆ తర్వాత ఆమె నటించిన ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, నా పేరు శివ, బిజినెస్ మెన్, టెంపర్, నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. 

ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే...దుల్కర్‌ సల్మాన్ సరసన కాజల్‌ నటించిన ‘'హే సినామిక’' చిత్రం మార్చి 3న థియేటర్లలో సందడి చేయనుంది.  మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య' (Acharya) ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Vijay Devarakonda-Rashmika: పెళ్లిపీటలెక్కబోతున్న విజయ్, రష్మిక... ముహూర్తం ఫిక్స్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More