Home> వినోదం
Advertisement

Colors Swathi Divorce: సమంత.. నిహారిక బాటలో కలర్స్ స్వాతి.. భర్తతో విడాకులు.. ఇదిగో ఫ్రూఫ్

బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయి.. సినిమా ఇండస్ట్రీలో కుడి ఆమంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కలర్స్ స్వాతి. 2018లో మలయాళి ఫ్యామిలీకి చెందిన పైలెట్ వికాస్‌ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇపుడు కొత్తగా  వీరు విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. 
 

Colors Swathi Divorce: సమంత.. నిహారిక బాటలో కలర్స్ స్వాతి.. భర్తతో విడాకులు.. ఇదిగో ఫ్రూఫ్

Colors Swathi Divorce: బుల్లి తెరపై యాంకర్‌ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుని స్వాతి రెడ్డి కాస్త కలర్స్ స్వాతిగా మారి సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది. బుల్లి తెర ద్వారా వచ్చిన క్రేజ్ తో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో కలర్స్ స్వాతి ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. 
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా లో వెంకటేష్ కు చిట్టి మరదలు పాత్రలో నటించడం ద్వారా ఒక్కసారిగా సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న కలర్స్ స్వాతి తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల తెలుగు లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు రాలేదు.. హీరోయిన్‌ గా ఈమెకు ఎక్కువ ఆఫర్లు దక్కలేదు. కానీ ఇతర భాషల్లో ఈమెకు మంచి ఆఫర్లు లభించాయి.. సక్సెస్ లు కూడా దక్కాయి అనే విషయం తెల్సిందే. తెలుగు లో కార్తికేయ  సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఆ తర్వాత ఈమెకు ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన స్వాతి మళ్లీ నటనపై ఆసక్తి చూపిస్తోంది. 

2018 సంవత్సరంలో మలయాళి ఫ్యామిలీకి చెందిన పైలెట్ వికాస్‌ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి వైవాహిక జీవితం చాలా బాగుందని నిరూపించేందుకు చాలా ఫోటోలు వీడియోలు ఆ మధ్య సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. థాయిల్యాండ్‌ లో సెటిల్ అయినా కూడా స్వాతి దంపతులు అప్పుడప్పుడు మీడియాలో సందడి చేస్తూనే ఉండేవారు. మొదటి సారి 2020 సంవత్సరంలో స్వాతి వైవాహిక జీవితం గురించి పుకార్లు మొదలు అయ్యాయి. స్వాతి తన భర్త వికాస్ నుండి విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు మొదలు అయ్యాయి. 

ఆమె తన ఇన్ స్టా లో వికాస్ ఫోటోలు ఎందుకు షేర్ చేయడం లేదు అంటూ కొందరు ప్రశ్నించారు. ఆ సమయంలో స్వాతి షేర్ చేసి తన భర్త ఫోటోలు ప్రత్యేకంగా ఉన్నట్లుగా చూపించింది. దాంతో ఆ సమయంలో స్వాతి విడాకుల గురించి పుకార్లు ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు కొత్తగా పుకార్లు మొదలు అయ్యాయి. 

Also Read: Indian 2 Update: వామ్మో శంకర్ మామూలోడు కాదు.. ఏకంగా ఆ పాత్రల కోసం సూపర్ టెక్నాలజీ..

ఇన్‌ స్టా గ్రామ్‌ లో స్వాతి ఈ మధ్య వికాస్ ఫోటోలను డిలీట్ చేసినట్లుగా ఆమె ఫాలోవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య సమంత.. ఆ తర్వాత నిహారిక.. అంతకు ముందు శ్రీజ లు విడాకులు తీసుకోవడానికి ముందు భర్తల ఫోటోలను సోషల్‌ మీడియా లో డిలీట్‌ చేయడం జరిగింది. ఇప్పుడు స్వాతి కూడా వికాస్ ఫోటోలను డిలీట్ చేయడం ద్వారా విడాకులు తీసుకోబోతున్నట్లుగా హింట్ ఇచ్చినట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి స్వాతి విడాకుల విషయం మళ్లీ వార్తల్లో నిలవడంతో ఆమె స్పందన ఏంటా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. 

గతంలో మాదిరిగా మరోసారి స్వాతి తన విడాకుల వార్తలు కేవలం పుకార్లే అంటూ తేల్చి చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్వాతి ప్రస్తుతానికి తెలుగు లో ఒక్క సినిమాను కూడా చేయడం లేదు. కానీ తమిళం లో మాత్రం ఒక సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Woman Killed Occultist: భర్తను వశీకరణం చేసుకునేందుకు పిలిచి మర్డర్ చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More