Home> వినోదం
Advertisement

Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్‌' నటుడు వినాయకన్‌ అరెస్ట్‌..

Actor Vinayakan Arrested By Hyderabad Police At Shamshabad Airport: జైలర్‌ సినిమాలో నటించిన నటుడు వినాయకన్‌ మరోసారి జైలు పాలయ్యాడు. ఓ కానిస్టేబుల్‌ దాడి చేశారనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్‌' నటుడు వినాయకన్‌ అరెస్ట్‌..

Jailer Varma Vinayakan: సినీ పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్‌ కొట్టిన నటుడికి మళ్లీ కష్టకాలమొచ్చింది. ఓ వివాదం అంశంలో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. దీంతో మళ్లీ అతడికి కష్టాలు ఎదురయ్యాయి. ఆయనే మలయాళ నటుడు వినాయకన్‌. పందెంకోడి సినిమాలో దివ్యాంగుడిగా నటించిన వినాయకన్‌ ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన 'జైలర్‌' సినిమాత రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అతడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read: Viran Muttamsetty: హీరోగా అల్లు అర్జున్ కజిన్ ఎంట్రీ.. ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ పోస్టర్

 

ఏం జరిగింది?
కొచ్చి నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌పై వినాయకన్‌ దాడికి పాల్పడ్డాడనే వివాదం ఏర్పడింది. మద్యం మత్తులో ఉన్న వినాయకన్‌ దాడి చేయడమే కాకుండా వాగ్వాదానికి దిగారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వినాయకన్‌ను శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Mr Bachchan: ఓటిటిలోకి మిస్టర్ బచ్చన్.. ఎప్పటినుంచి.. ఎక్కడంటే..!

 

కొన్ని నెలల కిందట సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'జైలర్‌' సినిమాలో వర్మ పాత్రతో వినాయకన్ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతేడాది అక్టోబర్‌ 23వ తేదీన ఒకరితో దురుసుగా ప్రవర్తించడంతో జైలుకు వెళ్లి వచ్చారు. అయినా ఆయన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. ఎయిర్‌పోర్టులో కానిస్టేబుల్‌పై దాడి వివాదంలో మళ్లీ జైలు పాలయ్యాడు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని వినాయకన్‌ చెబుతున్నాడు. తనతోనే పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.

తప్పు చేయాలే!
'నేను ఎలాంటి తప్పు చేయలేదు. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు నన్ను ఎయిర్‌పోర్టులోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాలి' అని వినాయకన్‌ తెలిపారు. 'పోలీసులు నన్ను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు' అని వినాయకన్‌ వాపోయారు. కాగా అరెస్ట్‌ చేసిన అనంతరం సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు వినాయకన్‌ను శంషాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More