Home> వినోదం
Advertisement

ఘనంగా హీరో నితిన్, షాలిని వివాహం

హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా నితిన్, షాలిని వివాహం (Nithin Wedding ) జరిగింది.

ఘనంగా హీరో నితిన్, షాలిని వివాహం

టాలీవుడ్ హీరో నితిన్ (Nithin) ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి షాలిని మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆదివారం (జులై 26న) రాత్రి నితిన్, షాలిని వివాహం (Nithin Marriage) ఘనంగా జరిగింది. ప్రేమ పక్షులు నితిన్, షాలినిలు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ముందుగా నిశ్చయించిన శుభముహూర్తానికి వివాహబంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ పెద్దలు, మిత్రులు నితిన్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆశీర్వదిస్తున్నారు. రానా, మిహికా వెడ్డింగ్ కార్డ్ చూశారా!

తాజాగా కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా నితిన్, షాలిని వివాహం (Nithin Shalini Wedding ) జరిగింది. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత, సినీ పరిశ్రమ నుంచి యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు నితిన్ వివాహ వేడుకకు హాజరయ్యారు. Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు

వాస్తవానికి నితిన్ పెళ్లి పనులు ఫిబ్రవరిలో మొదలయ్యాయి. ఏప్రిల్ 16న వివాహాన్ని నిశ్చయించారు. కానీ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లలో వాయిదా పడింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటే కరోనా వల్ల కుదరలేదు. నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్‌ల కూతురు షాలిని కందుకూరి, నితిన్‌కు ఎనిమిదేళ్లుగా పరిచయం. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న నితిన్, షాలిని తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న హార్ట్ ఎటాక్ బ్యూటీ

నితిన్, షాలిని ఐదు రోజుల పెళ్లి వేడుక జులై 22న వీరి నిశ్చితార్థంతో మొదలైంది. ఆ తర్వాత పెళ్లి పనులు చేస్తూనే మెహందీ, సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ క్రమంలో జులై 26న రాత్రి ఎనిమిదన్నర గంటలకు షాలిని మెడలో హీరో నితిన్ మూడుముళ్లు వేయగా వివాహ బంధం (Nithin Gets Married to Shalini )తో ఒక్కటయ్యారు. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Read More