Home> వినోదం
Advertisement

Nithin Engagement: ప్రేయసి షాలినితో హీరో నితిన్ ఎంగేజ్‌మెంట్

టాలీవుడ్ హీరో నితిన్ త్వరలో తన ప్రేయసిని వివాహం చేసుకోనున్నాడు. ఇరు కుటుంటాలు పెళ్లికి ఆశీర్వదించినా కరోనా కొంతకాలం అడ్డుపడింది. తాజాగా నితిన్ పెళ్లి పనులు (Nithin Engagement Photo) షురూ అయ్యాయి.

Nithin Engagement: ప్రేయసి షాలినితో హీరో నితిన్ ఎంగేజ్‌మెంట్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్లలో ఒకరైన యంగ్ హీరో నితిన్ (Nithin) ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన నితిన్, షాలిని పెళ్లి పనులు నేడు మొదలయ్యాయి. ఇరువురి కుటుంబాల్లో పెళ్లి సందడి షురూ అయింది. నితిన్, షాలిని నిశ్చితార్థ వేడుక (Nithin gets engaged to Shalini) కొందరు సన్నిహితుల మధ్య జరిగింది. షాలినికి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడుగుతున్న (Nithin Engagement Photo) ఫొటోను హీరో నితిన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు.  RGV ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది..

హీరో నితిన్, డాక్టర్ షాలినిల పెళ్లి వేడుకలు (Nithin Marriage) ఐదు రోజులపాటు జరగనున్నాయి. నేటితో వీరి పెళ్లి సందడి షురూ అయింది. నితిన్, షాలిని కుటంబాల పెద్దలు నిశ్చయ తాంబూళాలు మార్చుకున్న తర్వాత నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. నితిన్, షాలినిలు కుటుంబ సభ్యుల సమక్షంలో తమ భాగస్వామికి నిశ్చితార్థపు ఉంగరాలు తొడిగారు.  జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు

జులై 26న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు నితిన్, షాలిని వివాహానికి పెద్దలు శుభ ముహూర్తం నిశ్చయించారు. నితిన్ తన వివాహానికి కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడం తెలిసిందే. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వ సూచనలు, నిబంధనలు పాటిస్తూనే వేడుక నిర్వహించనున్నారు. Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Read More