Home> వినోదం
Advertisement

Ramya Raghupathi: పవిత్ర వచ్చాకే మాకు గొడవలు.. మగాడివయితే అలా చేయమంటూ నరేష్ మూడో భార్య రమ్యరఘుపతి సవాల్

Ramya Raghupathi on pavitra lokesh: కొద్ది రోజులుగా నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీద కొన్ని కామెంట్స్ చేశారు.

Ramya Raghupathi: పవిత్ర వచ్చాకే మాకు గొడవలు.. మగాడివయితే అలా చేయమంటూ నరేష్ మూడో భార్య రమ్యరఘుపతి సవాల్

Ramya Raghupathi on pavitra lokesh: గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని,  లేదు ఇప్పటికే చేసుకున్నారని,  కాదు కాదు సహజీవనం చేస్తున్నారు అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద కన్నడ మీడియా సంస్థ పవిత్ర లోకేష్ క్లారిటీ తీసుకోవడంతో ఆమె నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ మీద నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కన్నడ మీడియా సంస్థతో మాట్లాడారు. నరేష్,  పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ దానికి సంబంధించి వారు ఇద్దరు అధికారిక ప్రకటన చేయలేదని రమ్య పేర్కొన్నారు.

నాకు నరేష్ కు 2010 సంవత్సరంలో పెళ్లయిందని పేర్కొన్నారు రమ్య రఘుపతి. మాకు 9 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడనే విషయాన్ని ఆమె వెల్లడించారు. నరేష్ కు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయనే విషయం తనకు తర్వాత తెలిసిందని అయితే మా ఇద్దరికీ గొడవ జరిగిన ప్రతిసారీ ఆయన కన్నీళ్లతో నాకు క్షమాపణ చెప్పేవాడని ఆమె పేర్కొన్నారు. తన కుటుంబం చాలా పెద్దదని పేర్కొన్న రమ్య అనవసరంగా నా కుటుంబం గురించి ఆయన కామెంట్స్ చేస్తున్నాడని,  నరేష్ మగాడైతే తన కుటుంబం గురించి తాను మాట్లాడుకోవాలని పేర్కొన్నారు. మా గొడవలకు మా కొడుకు ఇబ్బంది పడకూడదని అంతా సహించాను అని ఆమె పేర్కొన్నారు. 

నరేష్ గురించి గాసిప్స్ వచ్చిన సమయంలో నా దగ్గరకు వచ్చి ఇవన్నీ ఫేక్ న్యూస్ అని నన్ను నమ్మించేవాడు అని ఆమె పేర్కొన్నారు. మా అత్తగారు విజయనిర్మల ఉన్నప్పటి నుంచి ఇదంతా జరుగుతోందని అయితే ఎప్పుడైతే పవిత్ర లోకేష్ మా మధ్యకు వచ్చిందో అప్పటినుంచి మా కుటుంబానికి ఇబ్బందులు మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవల నరేష్ నాకు విడాకుల నోటీసు పంపించారని,  చట్ట ప్రకారం నేను దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉందని రమ్య రఘుపతి పేర్కొన్నారు. నేను చెప్పని విషయాలు నేను చేయని పనులను కూడా నేనేదో చేసేసాను అనే విధంగా మీడియాలో కథనాలు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారని,  నాకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేయమని పోరాడుతున్నానని రమ్య రఘుపతి పేర్కొన్నారు. 

ఒక జర్నలిస్ట్ అయిన తన మీదే ఇలాంటి కట్టు కథలు ప్రచారం చేస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తనకు నరేష్ తో సత్సంబంధాలు లేవని,  విడాకుల తరువాత తనకు రావలసిన మెయింటెనెన్స్ విషయంలో ఓ క్లారిటీ లేదని తనకు విడాకులు ఇవ్వకుండానే ఆయన మరో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. నీకు గనక దమ్ము ఉంటే నీవు నీ తండ్రికే పుట్టావు అని అనుకుంటే మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకో నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ నరేష్ మీద ఘాటుగా స్పందించారు. తాను ఇంకా నరేష్ భార్యగానే ఉన్నానని,  ఒక్కసారి తనకు రావాల్సిన భరణం విషయంలో క్లారిటీ వస్తే విడిపోయేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని అని చెప్పుకొచ్చారు.

Also Read:Pavitra Lokesh: నరేష్ తో సహజీవనం.. కృష్ణతో కలిసే.. మొదటి పెళ్లిపై పవిత్ర లోకేష్ సంచలనం

Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీర‌క‌ట్లులోనూ అందాల‌ని అస్సలు దాచ‌ట్లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More