Home> వినోదం
Advertisement

Dil Raju Meets Jr NTR: దిల్‌ రాజ్‌ ఇంట్ల పెళ్లి బాజాలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌కే తొలి ఆహ్వానం

Jr NTR Invitation: బ్యాడ్‌ బాయ్స్‌ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన యువ హీరో ఆశీష్‌ రెడ్డి వివాహం త్వరలో జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి దిల్‌ రాజు కుటుంబం సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు ఆహ్వానం పలికారు.

Dil Raju Meets Jr NTR: దిల్‌ రాజ్‌ ఇంట్ల పెళ్లి బాజాలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌కే తొలి ఆహ్వానం

Dil Raju, NTR Meet: సినీ పరిశ్రమలో మరో యువ నటుడు బ్రహ్మాచారి జీవితానికి వీడ్కోలు పలుకుతున్నాడు. ఇప్పటికే నిశ్చితార్థం ఘనంగా జరగ్గా ఈ నెలలో వివాహానికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వివాహ ఆహ్వాన పత్రికల పంపకం మొదలైంది. తొలి కార్డును యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు ఇచ్చి ఆహ్వానం పలికారు. రానున్న రోజుల్లో మిగతా ప్రముఖులను కలిసి ఆహ్వానం పలకనున్నారు. 

నైజాం కింగ్‌ దిల్‌ రాజ్‌ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి మేనల్లుడైన యువ హీరో అశిశ్‌ రెడ్డి ఇంటివా కాబోతున్నాడు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహ వేడుకకు సంబంధించిన తొలి ఆహ్వానాన్ని యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు అందించాడు. వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. త్వరలోనే మిగతా సినీ ప్రముఖులను కూడా కలిసి దిల్‌ రాజు కుటుంబం ఆహ్వానం పలకనుంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందించేందుకు దిల్‌ రాజ్‌ కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. ఈనెల 14వ తేదీన జరగనున్న వివాహ వేడుకకు హాజరుకావాలని ఎన్టీఆర్‌కు దిల్‌ రాజు, శిరీష్‌, ఆశిశ్‌ ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అద్వైత రెడ్డితో ఆశిశ్‌ రెడ్డి వివాహం జరగనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 'బ్యాడ్‌ బాయ్స్‌' సినిమాతో ఆశీశ్‌ హీరోగా 2022లో పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆశిశ్‌ పలు సినిమాలు అంగీకరించాడు కానీ ఒక్కటీ విడుదల కాలేదు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్నాయి. 'సెల్ఫీష్‌' అనే సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Women Cheat Delhi Hotel: స్టార్‌ హోటల్‌లో మోసం చేయబోయి చిక్కిన తెలుగింటి మహిళ

Also Read: Love Proposal: ఇది 'ప్రేమ దోపిడీ'.. ఇతగాడి 'లవ్‌ ప్రపోజ్'‌ చూస్తే మీరు ప్రేమలో పడతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More