Home> వినోదం
Advertisement

Aakashavaani Trailer: ప్రభాస్ చేతుల మీదుగా ఆకాశవాణి ట్రైలర్ విడుదల

Aakashavaani Trailer review: తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న అశ్విన్ గంగరాజు ఆకాశవాణి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ఆకాశవాణి టీజర్‌ను రాజమౌళి విడుదల చేయగా.. ఈరోజు ట్రైలర్‌ను ప్రభాస్ (Prabhas) లాంచ్ చేశాడు.

Aakashavaani Trailer: ప్రభాస్ చేతుల మీదుగా ఆకాశవాణి ట్రైలర్ విడుదల

Aakashavaani Trailer: ఎస్ఎస్ రాజమౌళి వద్ద అసోసియేట్‌గా పనిచేసిన అశ్విన్ గంగరాజు తెరకెక్కించిన మూవీ ఆకాశవాణి. కొద్దిసేపటి క్రితమే డార్లింగ్ ప్రభాస్ చేతుల మీదుగా ఆకాశవాణి మూవీ ట్రైలర్ విడుదలైంది. గతంలో ఆకాశవాణి టీజర్‌ను రాజమౌళి విడుదల చేయగా.. ఈరోజు ట్రైలర్‌ను ప్రభాస్ (Prabhas) లాంచ్ చేశాడు. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఆకాశవాణి మూవీ ట్రైలర్ (Aakashavaani Trailer) చూస్తే సామాన్య ప్రజానికానికి, నాగరికతకు, అభివృద్ధికి దూరంగా దట్టమైన అడవిలో, అచ్చమైన ప్రకృతివనంలో నివాసం ఉంటున్న తెగ చుట్టూ అల్లుకున్న కథ అని అర్థమవుతోంది. అక్కడి ప్రజలను పీక్కు తినే దొర పాత్రలో వినయ్ వర్మ నటించాడు. 

Also read : Savitri W/o Satyamurthy trailer: సావిత్రి w/o సత్యమూర్తి ట్రైలర్.. ఆమెకి 60, అతడికి 20 ఏళ్లు..

తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న అశ్విన్ గంగరాజు ఆకాశవాణి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఆకాశవాణి (Aakashavaani) సినిమాకు మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సెప్టెంబర్ 24న సోనీ లైవ్‌ ఓటిటి ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల కానుంది.

Also read : Nene Naa trailer : ఉత్కంఠ రేకెత్తిస్తున్న నేనే నా ట్రైలర్

రఘువరన్ బీటెక్, విఐపి-2 చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి చేరువైన తమిళ నటుడు పి సముద్రఖని క్రాక్ సినిమాతో (Krack movie) విలన్ పాత్రలో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. ఇక ఆకాశవాణి సినిమాతో పాజిటివ్ పాత్రలో సముద్రఖని (Samuthirakani) మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆకాశవాణి సినిమా (Aakashavaani movie) ఏ మేరకు ఎంటర్‌టైన్ చేయనుందనేది తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచిచూడాల్సిందే.

Also read : Guduputani trailer: గూడుపుఠాణి ట్రైలర్.. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన Raghu Kunche

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More