Home> వినోదం
Advertisement

67th National Film Awards: 'జెర్సీ', 'మహర్షి' సినిమాలకు గానూ నేషనల్​ అవార్డ్స్​ అందుకున్న దర్శకనిర్మాతలు

67th National Film Awards: 67వ నేషనల్​ ఫిల్మ్​ అవార్డ్స్​ వేడుక సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. 

67th National Film Awards: 'జెర్సీ', 'మహర్షి' సినిమాలకు గానూ నేషనల్​ అవార్డ్స్​ అందుకున్న దర్శకనిర్మాతలు

67th National Film Awards: చిత్రసీమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు (National Film Awards Winners) అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ కూడా పాల్గొన్నారు. 

నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ ఎడిటింగ్​ విభాగాల్లో పురస్కారాలను (Jersey Movie Awards) అందుకుంది. చిత్ర దర్శకుడు గౌతమ్​ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఈ అవార్డులను అందుకున్నారు. బెస్ట్​ ఎంటర్​టైన్మెంట్​ మూవీ సహా బెస్ట్​ కొరియోగ్రాఫీ విభాగాల్లో 'మహర్షి' సినిమా (Maharshi Movie Awards) తరఫున దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్​ రాజు అందుకున్నారు. 
గతేడాది జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన 'చిచోరే' మూవీకి (Sushant Singh Rajput's Chhichhore movie) బెస్ట్ హిందీ ఫిలిం అవార్డ్ కైవసం చేసుకుంది. 

బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి 'మరక్కర్‌' నిలవగా.. 'భోంస్లే' చిత్రానికి మనోజ్‌ బాజ్‌పాయీ, 'అసురన్' చిత్రానికి గానూ ధనుష్‌ బెస్ట్​ యాక్టర్​ (Best Actor Award 2019) అవార్డులను సొంతం చేసుకున్నారు. 'మణికర్ణిక' చిత్రానికి కంగనా రనౌత్‌ బెస్ట్​ యాక్టరెస్​ (Kangana Ranaut National Award) అవార్డు దక్కించుకున్నారు. 

రజనీకి దాదా సాహెబ్​ ఫాల్కే

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు (Rajinikanth News) అత్యున్నత పురస్కారం వరించింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'దాదాసాహెబ్‌ ఫాల్కే' అవార్డు (Rajinikanth Dadasaheb Phalke Award) ఆయనకు లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించనుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును రజనీకాంత్​కు అందజేశారు. 

67వ నేషనల్​ ఫిల్మ్​ అవార్డ్స్​ విజేతలు వీరే..

బెస్ట్ ఫీచర్ ఫిలిం: 'మరక్కర్ అరబికడలింటే సింహం' (మలయాళం) (Best Feature Film: Marakkar Arabikadalinte Simham (Malayalam))

బెస్ట్ డైరెక్షన్: సంజయ్ పురాన్ సింగ్ ('బహత్తర్ హురైన్') 

ఉత్తమ నటుడు: తమిళ చిత్రం 'అసురన్' మూవీకిగాను ధనుష్‌, 'భోంస్లే' చిత్రానికిగాను మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డ్స్ దక్కించుకున్నారు. (Best Actor: Manoj Bajpayee for Bhonsle movie, Dhanush for Asuran movie)

ఉత్తమ నటి: కంగనా రనౌత్ ('మణికర్ణిక', 'పంగ' చిత్రాలు) (Best Actress: Kangana Ranaut for Manikarnika, Panga)

ఉత్తమ తెలుగు భాషా చిత్రం: 'జెర్సీ' (Best Telugu Film: Jersey movie)

ఉత్తమ హిందీ భాషా చిత్రం: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిత్రం 'చిచోరే'. (Best Hindi Film: Chhichhore movie)

ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి ('ది టస్కెంట్ ఫైల్స్') 

ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (సూపర్ డిలక్స్) 

ఉత్తమ బాలల చిత్రం: 'కస్తూరి' (హిందీ చిత్రం)  

ఉత్తమ కొరియోగ్రఫీ: మహేష్ బాబు నటించిన 'మహర్షి' మూవీకి గాను రాజు సుందరం బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డ్ కైవసం చేసుకున్నాడు. (Best Choreography: Mahesh Babu's Maharshi movie (Telugu)) 

బెస్ట్ వోల్‌సమ్ ఎంటర్‌టైన్మెంట్: బెస్ట్ వోల్‌సమ్ ఎంటర్‌టైన్మెంట్ అందించిన చిత్రాల జాబితాలో 'మహర్షి' మూవీకి మరో నేషనల్ అవార్డ్ దక్కింది.

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్​: 'మరక్కర్ అరబికడలింటే సింహం' (మలయాళం) 

స్పెషల్ జ్యూరీ అవార్డు: ఒత్త సెరుప్పు సైజ్-7 (తమిళం)

బెస్ట్ లిరిక్స్: కొలాంబి (మలయాళం)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ సాంగ్స్: విశ్వం (తమిళం)

బెస్ట్ ఎడిటింగ్: 'జెర్సీ' మూవీకి గాను నవీన్ నూలీ బెస్ట్ ఎడిటర్ అవార్డ్ దక్కించుకున్నాడు. (Best Editing: Naveen Nooli for Jersey movie (Telugu))

బెస్ట్​ సపోర్టింగ్​ యాక్టర్​: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

బెస్ట్​ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

బెస్ట్​ మ్యూజిక్​ డైరెక్టర్​ (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

ఉత్తమ నేపథ్య గాయని: బార్డో (మరాఠి) 

ఉత్తమ నేపథ్య గాయకుడు: కేస్రీ 

మోస్ట్ ఫిలిం-ఫ్రెండ్లీ స్టేట్: సిక్కిం

Also Read: Mannara Chopra: అక్కకు మించిన అందాలతో పోగొడుతున్న మన్నారా చోప్రా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Read More