Home> వినోదం
Advertisement

హెబ్బా పటేల్ నటించిన 24 కిస్సెస్ మూవీ ట్రైలర్

24 కిస్సెస్ సినిమా ట్రైలర్ 

హెబ్బా పటేల్ నటించిన 24 కిస్సెస్ మూవీ ట్రైలర్

మిణుగురులు సినిమా తర్వాత అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి డైరెక్ట్ చేసిన 24 కిస్సెస్ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదల కానున్న నేపధ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. అదిత్‌ అరుణ్, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన ఈ సినిమాను రెస్పెక్ట్‌ క్రియేషన్స్, సిల్లీ మాంక్స్‌ కంబైన్స్‌ బ్యానర్‌‌పై సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల, అయోధ్యకుమార్‌ నిర్మించారు. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా డైరెక్టర్‌ అయోధ్యకుమార్‌ మాట్లాడుతూ.. "24 కిస్సెస్' సినిమాను మొదట వేరే నిర్మాతలతో ప్రారంభించానని తెలిపారు. అయితే, తన క్రియేటివిటీ విషయంలో వారి వద్ద తనకు అంతగా స్వేచ్ఛ లేనందున వారితో సినిమాను విరమించుకుని, ఆ తర్వాత సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాలతో సినిమాను పూర్తి చేసినట్టు తెలిపారు. 

 

మిణుగురులు వంటి సినిమాను తెలుగు వారికి అందించిన అయోధ్య కుమార్‌ ‘24 కిస్సెస్‌’ లాంటి సినిమాను తెరకెక్కించడం ఏంటనే విమర్శలు వినిపించాయి. కానీ తానెప్పుడూ తన స్థాయిని మరిచి కిందకి దిగజారను అని దర్శకుడు అయోధ్య కుమార్ ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Read More