Home> క్రైమ్
Advertisement

Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి

Man Dies While Running on Treadmill: ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ.. 19 ఏళ్ల యువకుడు ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. జిమ్‌లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా.. 
 

Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి

Man Dies While Running on Treadmill: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రెడ్ మిల్‌పై పరిగెడుతూ.. ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక సంఘటన ఘజియాబాద్‌లోని సరస్వతీ విహార్‌లో ఉన్న స్థానిక జిమ్‌లో చోటు చేసుకుంది. మృతుడిని సిద్ధార్థ్ కుమార్ సింగ్‌ (19)గా గుర్తించారు. రోజూ మాదిరే వ్యాయామం చేస్తున్న యువకుడు ఎలాంటి స్పందన లేకుండా ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటు మరణించడం దురదృష్టకరం. జిమ్‌లో యువకుడు కుప్పకూలిపోయి మరణించి దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా..

సిద్ధార్థ్ కుమార్ సింగ్ అనే యుకువు నోయిడాలోని ఓ కళాశాలలో చదువుతున్నాడు. తండ్రితో కలిసి నోయిడాలో ఉంటున్నాడు. తల్లి బీహార్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. శనివారం జిమ్‌కు వచ్చిన సిద్ధార్థ్ కుమార్ సింగ్.. వర్కౌట్స్ చేస్తూ ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ కోసం ఎక్కాడు. కాసేపు పరిగెత్తిన తరువాత ఒక్కసారి కుప్పకూలి కిందపడిపోయాడు. వెంటనే స్పృహ కోల్పోగా.. జిమ్‌లో ఉన్న వారు వెంటనే వచ్చి సాయం చేసేందుకు ప్రయత్నించారు. ట్రెడ్‌మిల్‌ నుంచి పైకి లేపి.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
 
ఆసుపత్రిలోని వైద్యులు సిద్ధార్థ్‌ కుమార్ సింగ్‌ను బతికించేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అతను మరణించినట్లు తెలిపారు. దీంతో మృతుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సిద్దార్థ్ కుమార్ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో జిమ్ ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. సిద్ధార్థ్‌ కుమార్ మృతిపై వివరాలు ఆరా తీస్తున్నారు.

Also Read: Samsung Galaxy A14 5G Price: రూ.7,399కే Samsung Galaxy A14 మొబైల్‌..వినాయక చవితి స్పెషల్‌ ఆఫర్‌..  

Also Read: Narendra Modi Birthday: వచ్చే ఎన్నికల్లో కూడా BJP గెలుపు ఖాయమా? ప్రధాని నరేంద్ర మోదీ జాతకంలో కీలక విషయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More