Home> క్రైమ్
Advertisement

Crime News: పెద్దపల్లి జిల్లాలో భర్తను చంపించిన భార్య..పోలీసుల దగ్గర కీలక విషయాలు..!

Crime News: పచ్చటి కాపురాల్లో వివాహేతర సంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలను తీస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటననే తీవ్ర కలకలం రేపుతోంది.

Crime News: పెద్దపల్లి జిల్లాలో భర్తను చంపించిన భార్య..పోలీసుల దగ్గర కీలక విషయాలు..!

Crime News: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళితో కొర కొప్పుల రాజేందర్‌కు ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వివాహం అయిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లేదు. రవళికి మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు భర్త గుర్తించాడు. దీనిపై పలుమార్లు మందలించాడు..నిలదీశాడు. ఇటీవల పంచాయతీ సైతం జరిగింది. ఇక నుంచి కలిసి జీవిస్తామని పెద్దల ముందు ప్రమాణం చేసింది. 

అత్తమామలతో కాకుండా విడిగా ఉండేందుకు భర్తతో విడిగా ఉండేందుకు అంగీకరించింది. దీంతో రాజేందర్‌ విడిగా కాపురం పెట్టాడు. తండ్రి వారసత్వంగా ఆరు నెలల క్రితమే అతడు సింగరేణి ఉద్యోగంలో చేరాడు. ఈక్రమంలోనే పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌ ప్రాంతంలో సింగరేణిలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం విధులకు వెళ్లి వచ్చి రాత్రి ఇంట్లో పడుకున్నాడు. ఇదే అదునుగా అతడిని చంపేందుకు రవళి వ్యూహాం రచించింది.

తెల్లవారుజామున పథకం ప్రకారం రవళి ఇంటి తలుపు తెరిచి ఉంచింది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు. ఒకడు లోపలికి వెళ్లి రాజేందర్‌  కుడి కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వెంటనే వారు అక్కడి నుంచి పరారైయ్యారు. తుపాకీ శబ్ధం భారీగా రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు బయటకు వచ్చారు. రాజేందర్‌ ఇంట్లో రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు.

ఘటన అంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయినట్లు విచారణలో తేలింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తుల రాకను గుర్తించారు. రవళి మాత్రం అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. తాను వాష్‌రూమ్‌ వెళ్లి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారని కుటుంబసభ్యులకు తెలిపింది. ఐతే ఆమె తీరుపై రాజేందర్ కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భర్తను చంపేందుకు గతంలోనే రెండుసార్లు ప్రయత్నం చేసిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇంటి గేటుకు విద్యుత్ తీగను కలిపి హత్య చేసేందుకు ప్రయత్నించిందని అంటున్నారు. ఆ సమయంలో మరో వ్యక్తి పట్టుకోవడంతో షాక్‌కు గురైయ్యారని వెల్లడిస్తున్నారు. ఇటీవల రాజేందర్‌ రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడని..ఇందులో అతడు గాయాలతో బయటపడ్డాడని..దీనిపై అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు.

కాల్పుల వెనుక భార్య పన్నాగం ఉందని ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలిని పెద్దపల్లి ఇన్‌ఛార్జ్ డీసీపీ రూపేష్‌ పరిశీలించారు. రాజేందర్‌ ఇంట్లో హెల్మెట్, బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రవళి నుంచి కీలక విషయాలను రాబట్టుతున్నారు. రాజేందర్ కుటుంసభ్యులు మాత్రం రవళి, మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

fallbacks

Also read:Amit Sha Meets Jr Ntr: బిగ్ బ్రేకింగ్: అమిత్ షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్..పొలిటికల్ రీ ఎంట్రీ!

Also read:Amit Sha Munugode Meeting Live Updates: కాసేపట్లో మునుగోడుకు అమిత్ షా.. గ్యాస్ సిలిండర్ బెలూన్లతో కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More