Home> క్రైమ్
Advertisement

Tragedy Incdent: పిల్లలు పుట్టడం లేదని భార్యాభర్తలు ఆత్మహత్య.. రాఖీ రోజే ఘోరం

Wife And Husband Commit Suicide: పెళ్లయి దశాబ్దం గడిచినా కూడా తమకు సంతానం కలగకపోవడంతో భార్యాభార్తలు తమ ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

Tragedy Incdent: పిల్లలు పుట్టడం లేదని భార్యాభర్తలు ఆత్మహత్య.. రాఖీ రోజే ఘోరం

No Children: వివాహమై పదేళ్లు దాటింది. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. చక్కగా కాపురం సాగుతున్నా సంతానం మాత్రం కలగడం లేదు. అన్ని దేవుళ్లకు మొక్కారు. చేయలేని ప్రయత్నం అంటూ లేదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నా తమకు పిల్లలు కలగకపోవడంతో ఆ దంపతులు మనస్తాపానికి లోనయ్యారు. పిల్లలు లేరని తరచూ బాధపడుతున్నారు. ఇక తమకు పిల్లలు కలగరని నిర్ధారించుకున్న భర్త మొదట ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక అతడి భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగింది.

Also Read: Weather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచన

పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లి బుడగజంగాల కాలనీలో భార్యాభర్తలు గురవయ్య (38), వెంకటక్క (32) నివసిస్తున్నారు. వీరికి పెళ్లయి దాదాపు పదేళ్లు దాటింది. ఇప్పటివరకు వారికి సంతానం కలగలేదు. సంతానం కోసం అన్ని రకాల వైద్య ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా దేవుళ్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అయినా కూడా వారికి సంతానప్రాప్తి కలగలేదు. 

Also Read: Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?

పిల్లలు పుట్టకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు ఆందోళన చెందుతున్నారు. ఇక తమకు పిల్లలు పుట్టరని భావించి భర్త గురవయ్య ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మరణాన్ని భార్య వెంకటక్క తట్టుకోలేకపోయింది. పిల్లలు లేక.. భర్త లేకపోవడంతో వెంకటక్క అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్కు పాల్పడింది. భార్యాభర్తలు ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. పిల్లలు కలగకపోవడంతో వారు బలవన్మరణానికి పాల్పడినట్లు బంధుమిత్రులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More