Home> క్రైమ్
Advertisement

Vizianagaram Suicide: ఘోరం.. బావిలో శవాలై తేలిన కుటుంబం, పెళ్లికి వచ్చిన కూతురితో ఇలా!

బావిలో పూర్తి కుటుంబం శవాలై తేలిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో చోటుచేసుకుంది. కుటుంబంలో తల్లీదండ్రులతో పాటు పెళ్లి ఈడుకొచ్చిన వారి కూతురు కూడా విగతజీవిగా కనిపించింది. ఆ వివరాలు.. 
 

Vizianagaram Suicide: ఘోరం.. బావిలో శవాలై తేలిన కుటుంబం, పెళ్లికి వచ్చిన కూతురితో ఇలా!

Vizianagaram Suicide: విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో విషాదం చోటుచేసుకుంది. బావిలో ఓ కుటుంబం మొత్తం శవాలై తేలిన ఘటన స్థానికంగా కలవరానికి గురిచేస్తోంది. ఏదైనా ఆపద వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా లేదా మరేదైనా కారణంతో ఈ దారుణం జరిగిందా అనే వివరాలు తెలియలేదు. కుటుంబంలో తల్లీదండ్రులతో పాటు పెళ్లి ఈడుకొచ్చిన వారి కూతురు కూడా విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. 

ఏం జరిగిదంటే?
స్థానికుల కథనం ప్రకారం.. విశాఖపట్నం మర్రిపాలెంకు చెందిన MD ముహముద్దీన్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఆయన భార్య షరీష నిషా, కూతురు ఫాతిమా ఉన్నారు. ఎప్పుడూ ఎవరి పని వారు చేసేకునే వారు అకస్మాత్తుగా విజయనగరం జిల్లా కొత్త వలస మండలం చింతలపాలెం గ్రామ శివార్లలో వీరి మృతదేహాలు కనిపించాయి. 

Also Read: Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదమే

వ్యవసాయం చేసుకునే పొలాల మధ్యలోని ఓ బావిలో ముహముద్దీన్ కుటుంబం శవాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసు అధికారులు నీటిపై తేలిఆడుతున్న మృతదేహాలను బయటకి తీసి పోస్టు మార్టానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల వివరాలను సేకరించిన పోలీసులు.. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. 

మృతుడు మహముద్దీన్ తన కుటుంబంతో సహా క్యాబ్ లో అక్కడికి వచ్చి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని కుమారుడు ఆలీకి తెలియజేశారట. ఫోన్ చేయడమే కాకుండా వారంతా సూసైడ్ చేసుకున్న స్పాట్ ను లోకేషన్ ఆలీకి షేర్ చేశారట. ఈ ఘటనపై కొత్తవలస సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరించారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకొని.. ఈ ఆత్మహత్యకు గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు.

Also Read: Realme 60X 5G Price: మొదటి సేల్‌లోనే Realme Narzo 60x 5Gపై భారీ తగ్గింపు, డిస్కౌంట్‌ ఆఫర్స్‌, ఇతర వివరాలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More