Home> క్రైమ్
Advertisement

Girl Ate Rat Kill: చాక్లెట్ అనుకుని ఎలుకల మందు తిన్న చిన్నారి

Girl Died After Eating Rat Kill: ఎలుకల మందు ఓ చిన్నారి ప్రాణం తీసింది. చాక్లెట్​ అనుకొని ఎలుకల మందును తిన్న ఓ చిన్నారి మృతి చెందిన‌ ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో చోటుచేసుకుంది. 

Girl Ate Rat Kill: చాక్లెట్ అనుకుని ఎలుకల మందు తిన్న చిన్నారి

Girl Died After Eating Rat Kill: ఎలుకల మందు ఓ చిన్నారి ప్రాణం తీసింది. చాక్లెట్​ అనుకొని ఎలుకల మందును తిన్న ఓ చిన్నారి మృతి చెందిన‌ ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో చోటుచేసుకుంది. చనిపోయిన చిన్నారి పేరు వైష్ణవి. వయస్సు మూడేళ్లు. సెల్వ రాజు, వెంకటమ్మ దంపతుల గారాలపట్టి ఈ వైష్ణవి. ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ కావడంతో ఆ ఎలుకలను నివారించేందుకని వైష్ణవి తల్లిదండ్రులు ఎలుకల మందు తీసుకొచ్చి ఓ చాక్లెట్ తరహాలో ఉండ చుట్టి ఎలుకలు తిరిగే చోట పెట్టారు. 

ఈ నెల 25న శనివారం నాడు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ ఎలుకల మందు ఉన్న చోటుకు వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. అది ఎలుకల మందు అని తెలియక చాక్లెట్ అనుకుని పొరపాటున తినేసింది. చాక్లెట్ అనుకుని ఎలుకల మందు తిన్న చిన్నారి అస్వస్థతకు గురివకావడంతో వెంటనే బాలికను తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. 

అప్పటి నుంచి గత నాలుగు రోజులుగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన చిన్నారి కొన ఊపిరి మంగళవారం ఆగిపోయింది. ఎలుకల కోసం పెట్టిన మందు తిని తమ గారాలపట్టి ఇలా అర్థాంతరంగా తమ కళ్ల ముందే తనువు చాలిస్తుందని ఊహించలేదే అంటూ వైష్ణవి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

చిన్నారులు ఉన్న ఇంట్లో విషపదార్థాలతో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దాని పర్యావసానాలు ఊహకందనివిగా ఉంటాయని.. కొన్నిసార్లు బుడిబుడి అడుగులు వేసే ఇంట్లో చివరకు ఇంట్లో విషాదం మిగిలే ప్రమాదం కూడా ఉంటుందని వైష్ణవి ఘటన నిరూపించింది. ఇలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ఉండేందుకే '' ర్యాట్ కిల్ వంటి విష పదార్థాలపై చిన్నపిల్లలకు దూరంగా ఉంచండి '' అంటూ ఓ హెచ్చరిక కూడా ఉంటుంది. అయినప్పటికీ ఆ హెచ్చరికలను బేఖాతరు చేయడం లేదా అంతదూరం ఆలోచించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి.. తల్లిదండ్రులకు జీవితాతం కడుపు శోకం మిగిలిస్తున్నాయని చిన్నారులు ఉన్న తల్లిదండ్రులకు వైష్ణవి మృతి ఓ హెచ్చరికగా మిగిలిపోయింది. వైష్ణవి మృతితో పెద్దగోపతిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి : KCR Review Meeting: కేసీఆర్ సమీక్షా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు

ఇది కూడా చదవండి : KTR Defamation Suit: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేటిఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు

ఇది కూడా చదవండి : Wines Bandh: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆరోజు మొత్తం వైన్స్ బంద్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More