Home> క్రైమ్
Advertisement

Kattappa Killed: దారుణంగా 'కట్టప్ప'ను చంపేసిన దొంగ.. కారణం తెలిస్తే షాకవుతారు

Theif Killed To Kattappa While Doing Pig Theft In Shadnagar: అభంశుభం ఎరుగని బాలుడిని ఓ దొంగ పొట్టన బెట్టుకున్నాడు. దొంగతనం చేస్తుండగా చూశాడని బాలుడిని దొంగ చంపేశాడు.

Kattappa Killed: దారుణంగా 'కట్టప్ప'ను చంపేసిన దొంగ.. కారణం తెలిస్తే షాకవుతారు

Kattappa Killed: దొంగతనానికి వచ్చిన వ్యక్తి తాను దొంగతనం చేస్తుండగా ఓ బాలుడు చూశాడు. దీంతో భయపడిన దొంగ దొంగతనం విషయం వేరే వాళ్లకు చెబుతాడని భయపడ్డాడు. వెంటనే ఆ బాలుడిని హతమార్చాడు. ఈ అమానుష సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడు దొంగ చేతిలో బలయ్యాడు. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Farmer Suicide: రైతు ప్రాణం తీసిన రుణమాఫీ.. ప్రభుత్వ కార్యాలయంలో ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని హాజీపల్లి రోడ్డులో కొంతమంది గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. పందుల పెంపకం చేపడుతూ జీవనోపాధి పొందుతున్నారు. పందులు పోషించడం అనంతరం వాటిని అమ్మడం చేస్తుంటారు. అయితే శుక్రవారం రాత్రి సమయంలో ఎల్లయ్య అనే వ్యక్తి పందుల దొంగతనానికి వచ్చాడు. అయితే అదే పరిసరాల్లో ఉన్న గుడిసెలో దుర్గయ్య, సాయమ్మ కొడుకు ఆరేళ్ల బాలుడు కట్టప్ప చూశాడు.

Also Read: Family Suicide: స్నానం చేయిస్తానని చెప్పి పిల్లలను చెరువులోకి తోసి ఆపై ఆమె దూకి..విషాదం

తాను పందులు దొంగిలించిన విషయాన్ని ఎవరికైనా చెబుతారనే భయంతో దొంగతనానికి వచ్చిన ఎల్లయ్య భయాందోళన చెందాడు. వెంటనే బాలుడు కట్టప్ప వద్దకు వచ్చాడు. కోపంతో విచక్షణ రహితంగా కొట్టాడు. బాలుడిని బండకేసి  మోదడంతో కట్టప్ప తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం లేచి చూసిన గుడిసెవాసులు బోరున విలపించారు. సమాచారం అందుకునన్ షాద్‌నగర్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసుల సమక్షంలో బాలుడి అంత్యక్రియలు జరిగాయి. అయితే నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. కాగా గుడిసెవాసులు ఎక్కడ ఆందోళన చేస్తారనే భయంతో మందే పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా కట్టప్ప అంత్యక్రియలు జరిపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More