Home> క్రైమ్
Advertisement

Crime News: క్రైమ్ పెట్రోల్ షో చూసి.. ప్రియుడి కోసం కన్న బిడ్డనే కాటికి పంపిన కసాయి తల్లి..!

Woman Killa Daughter: భర్త, కూతురు ఉండి కూడా అక్రమ సంబంధం కోరుకున్న ఒక మహిళ , తన అక్రమ సంబంధానికి అడ్డుగా నిలిచిందని తన ప్రియుడు కోసం వెళ్తూ 3 సంవత్సరాల కన్న కూతురిని కడతేర్చి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఇది కాస్త బయటపడింది. 

Crime News: క్రైమ్ పెట్రోల్ షో చూసి.. ప్రియుడి కోసం కన్న బిడ్డనే కాటికి పంపిన కసాయి తల్లి..!

Shocking Crime: మాతృత్వం అనేది ఒక వరం.. ఆ మాతృత్వం పొందడం కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అయితే అలాంటి మాతృత్వం పొందిన తరువాత ఆ తల్లి ఆ బిడ్డ పాలిట కసాయిగా మారితే ఇంతకంటే ఘోరం మరెక్కడ ఉండదు. బిడ్డకు అన్నివేళలా అండగా ఉంటూ బిడ్డ ఆలనా పాలనా చూసుకోవాల్సిన ఒక తల్లి, తన  ప్రియుడి మోజులో పడి తన అక్రమ సంబంధానికి అడ్డుగా నిలుస్తోందని కన్న బిడ్డని కడతేర్చిన కసాయి తల్లి వైనం ఇది. తాజాగా బీహార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం ప్రతి ఒక్కరిని కదిలించింది. 

తాజాగా బీహార్లో కన్నబిడ్డను ఒక కసాయి తల్లి కడతేర్చింది.  ముజఫర్పూర్ లో కాజల్ అనే మహిళ తన మూడేళ్ల కూతురు గొంతు కోసి,  చంపి , అనుమానం రాకుండా మృతదేహాన్ని బ్యాగ్ లో పెట్టింది. పోలీసుల వివరాల ప్రకారం కాజల్ తన ప్రియుడుతో కలిసి వెళ్లిపోవాలనుకుంది. కానీ తనతో పాటు తన కూతుర్ని కూడా తీసుకెళ్లడం తన ప్రియుడికి ఇష్టం లేదు.  దీంతో క్రైమ్ పెట్రోల్ షో చూసి మరి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక కాజల్ భర్త ఫిర్యాదుతో ఈ ఉదంతం కాస్త బయటపడింది..

నిజానికి కొన్ని టీవీ ఛానళ్లు ప్రజలలో అవేర్నెస్ నింపడానికి ఇలాంటి షోలు చేస్తూ ఉంటాయి. వీటిని సాధ్యమైనంత వరకు మంచి పనులకే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది . కానీ చాలామంది ఇలాంటి షోలను దుర్వినియోగం చేస్తున్నారు  ఇలాంటి వాటి వల్ల చాలామంది తప్పుదోవ పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 ఈ క్రమంలోనే కాజల్ అనే  మహిళ క్రైమ్ పెట్రోల్ షో చూసి మరి తన మూడేళ్ల కూతుర్ని హతమార్చింది అంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు.  ఏది ఏమైనా భర్త ఉండి కూతుర్ని చూసుకోవాల్సింది పోయి , అక్రమ సంబంధం కోసం ప్రియుడు మోజులో పడి కన్న బిడ్డ నే కాటికి పంపింది  అంటే.. ఆ తల్లి  ఎంతటి కసాయో అర్థం చేసుకోవచ్చు. 

తాజాగా ఈ ఘటన కాజల్ భర్త కారణంగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతున్న కాలంలో.. కన్నతల్లి కసాయిగా మారడం అత్యంత దారుణం అంటూ నిట్టూరుస్తున్నారు.

Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More