Home> క్రైమ్
Advertisement

Robbery Batch Attacks: తుపాకీ చూపించి దారి దోపిడి.. కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్

Robbery Batch Attacks:ఢిల్లీ, సరైకలే ఖావ్, నొయిడాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన 1.5 కిమీ పొడవైన సొరంగమార్గంలో ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగలు రెండు బైకులపై వచ్చి కారును అడ్డుకోవడం.. అందులో ఒకరు తుపాకీ చూపించి డ్రైవర్ ని బెదిరిస్తుండగా.. మరొకడు వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి నుంచి క్యాష్ బ్యాగు దోచుకోవడం టన్నెల్లో ఏర్పాటు చేసిన సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయింది.

Robbery Batch Attacks: తుపాకీ చూపించి దారి దోపిడి.. కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్

Robbery Batch Attacks: దేశ రాజధాని ఢిల్లీలో దారి దోపిడీలు సర్వసాధారణం అయ్యాయి. తాజాగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అండర్‌పాస్ టన్నెల్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. డబ్బులు డెలివరి చేయడానికి కారులో వెళ్తున్న ఒక ఏజెంట్, అతడి సహాయకుడిని టన్నెల్లో రెండు బైకులపై వచ్చి అడ్డుకున్న నలుగురు దుండగులు.. తుపాకీ చూపించి బెదిరిస్తూ వారిని దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలు దోపిడీ దొంగలు కారులోని డెలివరీ ఏజెంట్స్ నుంచి రూ. 2 లక్షలు దోచుకుని పరారయ్యారు. బాధితులు ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వైపు వెళ్తుండగా ప్రగతి మైదాన్ టన్నెల్లో ఈ ఘటన జరిగింది అని ఢిల్లీ పోలీసులు మీడియాకు తెలిపారు. 

ఢిల్లీ, సరైకలే ఖావ్, నొయిడాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన 1.5 కిమీ పొడవైన సొరంగమార్గంలో ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగలు రెండు బైకులపై వచ్చి కారును అడ్డుకోవడం.. అందులో ఒకరు తుపాకీ చూపించి డ్రైవర్ ని బెదిరిస్తుండగా.. మరొకడు వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి నుంచి క్యాష్ బ్యాగు దోచుకోవడం టన్నెల్లో ఏర్పాటు చేసిన సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయింది. ఢిల్లీ పోలీసులు ఈ సీసీటీవీ దృశ్యాలను మీడియాకు విడుదల చేయగా ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నగదు పోగొట్టుకున్న బాధితుడు రెడ్ ఫోర్ట్ నుంచి గురుగ్రామ్ కి ఓలా కారు బుక్ చేసుకుని వెళ్తున్న సమయంలో ఈ దోపిడి జరిగింది. దోపిడీ జరిగిన తీరు చూస్తోంటే... కారులో నగదు తీసుకెళ్తున్నట్టుగా బాగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని అర్థం అవుతోంది అని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. 

ఢిల్లీలో తరచుగా దారి దోపిడిలు జరుగుతుండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాపై మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలకు భద్రతను అందివ్వలేకపోతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పుకుని ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు అంటూ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదే ఘటనను ప్రస్తావిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై సైతం నిప్పులు చెరిగారు. ఢిల్లీ ప్రజలకు రక్షణ అందివ్వడం మీ చేతకాకపోతే ఆ బాధ్యతను ఢిల్లీ సర్కారుకు వదిలేయండి.. మేం చూసుకుంటాం అని కేంద్రంపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఇది కూడా చదవండి : Reviews and Rating Jobs: రివ్యూలు రాసి, రేటింగ్ ఇస్తే చాలు మీ ఖాతాలో వేలకు వేలు

ఢిల్లీ మంత్రి అతిషి సైతం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన మంచి పనులకు సంబంధించిన క్రెడిట్ తీసుకునేందుకు ఎలాగైతే సమయం కేటాయిస్తున్నారో.. అలాగే రాజ్యంగం పరంగా మీకు ఇచ్చిన బాద్యతలు కూడా నిర్వర్తించేందుకు కృషిచేయండి అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తానికి ప్రగతి మైదాన్ టన్నెల్లో దోపిడీ ఘటన కేంద్రంపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి ఢిల్లీ సర్కారుకు మరో అవకాశం లభించినట్టయింది.

ఇది కూడా చదవండి : Birthday Boy Killed By Friends: బర్త్‌డే పార్టీ ఇచ్చిన ఫ్రెండ్‌నే మర్డర్ చేశారు.. కారణం ఏంటో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More