Home> క్రైమ్
Advertisement

Red Light: మరో హైటెక్‌ వ్యభిచార దందా గుట్టురట్టు.. వీరి కథ వింటే మతిపోతది

Police Arrested Prostitution Gang: అమ్మాయిలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి భారీగా నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Red Light: మరో హైటెక్‌ వ్యభిచార దందా గుట్టురట్టు.. వీరి కథ వింటే మతిపోతది

Hyderabad Police: ఇతర ప్రాంతాల అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న చీకటి దందాపై పోలీసులు దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి వ్యభిచార దందాకు తెరదించారు. చీకటి వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా నగదు, వాహనాలను స్వాధీనం చేసుకోగా.. అమ్మాయిలు, విటులను అరెస్ట్‌ చేశారు.

Also Read: Love Murder: కన్న కూతురా రాక్షసా ఇలాంటి బిడ్డ కూడా ఉంటుందా? కన్న తండ్రిని దారుణహత్య

 

హైద‌రాబాద్‌లో మరో వ్య‌భిచార ముఠా గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. ఇత‌ర ప్రాంతాల నుంచి యువతుల‌ను హైద‌రాబాద్‌కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు స‌భ్యుల‌ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సార్ న‌గ‌ర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వ్య‌భిచార దందా ప‌క్కా స‌మాచారం రావడంతో బుధ‌వారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. ఓ హోట‌ల్‌లో త‌నిఖీలు నిర్వ‌హించగా ఈ చీకటి దందా బయటపడింది.

Also Read: Dating Scam: పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి అమ్మాయిల మోసం.. ఏడుగురి ముఠా అరెస్ట్

 

ఇతర ప్రాంతాలకు చెందిన సూర్య కుమారి అలియాస్ రాణి (38), కె విజ‌య శేఖ‌ర్ రెడ్డి (49), అర్కోకిట్ ముఖ‌ర్జీ (30)తోపాటు మ‌రో ఇద్ద‌రు ముఠాగా ఏర్పడ్డారు. రాణి, శేఖ‌ర్ రెడ్డి, ముఖ‌ర్జీ క‌లిసి వ్యభిచారం చేయించడానికి ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువస్తారు. పశ్చిమ బెంగాల్‌, త్రిపుర‌, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిల‌ను తీసుకొచ్చి వ్య‌భిచారం చేయిస్తున్నారు. 

ఈ యువ‌తుల‌కు ఎస్సార్ న‌గ‌ర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీరే వసతి సౌకర్యం కూడా క‌ల్పించారు. విటులు కోరిన చోటకు యువ‌తుల‌ను చేరుస్తారు. హోట‌ల్స్‌, ప్ర‌యివేటు ఫామ్ హౌజ్‌ల‌కు అమ్మాయిలను తరలించి వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.89,500 న‌గ‌దు, రెండు కార్లు, మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు, బ్యాంక్ పాస్‌ పుస్తకాలు, డెబిట్ క్రెడిట్‌ కార్డుల‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అరెస్ట్‌ నుంచి ఇద్దరు తప్పించుకున్నారు. వారిని పోలీసులు గాలిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More