Home> క్రైమ్
Advertisement

Love Fail: దేశం మెచ్చింది.. కానీ ప్రేయసి తిరస్కరించింది.. యువ జవాన్‌ ఆత్మహత్య

Young Army Man Commits Suicide With Love Fail: ఎన్నో ఆశలతో దేశానికి సేవ చేద్దామని వెళ్లిన యువకుడు ప్రేయసి తన ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోలేకపోయాడు. ప్రేమ విఫలమవడంతో తనను తాను బలి తీసుకున్నాడు.

Love Fail: దేశం మెచ్చింది.. కానీ ప్రేయసి తిరస్కరించింది.. యువ జవాన్‌ ఆత్మహత్య

Love Tragedy: దేశంపై ఎంతో ప్రేమతో సైన్యంలో చేరాడు. శిక్షణ పూర్తి చేసుకుని త్వరలోనే దేశ రక్షణ కోసం వెళ్లాల్సి ఉంది. కానీ తాను ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చి ఆ సైనికుడు తన ప్రాణం తీసేసుకున్నాడు. తన ప్రేమను నిరాకరించిన కారణంగా ఆ యువ సైనికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: Blackmail: ఈ టిల్లుగాడు రాధిక కన్నా డేంజర్‌గాడు .. ఫ్రెండ్‌ ఫోన్‌ తీసుకుని బ్లాక్ మెయిల్

 

వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట చింటూ (20) గతేడాది సైన్యంలో చేరాడు. 2023 భారత సైన్యంలో శిక్షణ తీసుకున్నాడు. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని చింటూ గుజరాత్‌లో విధుల్లో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో సెలవుపై స్వగ్రామం చేరుకున్నాడు. అయితే చింటూ అప్పటికే ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ యువతితో చింటూ మాట్లాడి తన ప్రేమ విషయం చెప్పాడు.

Also Read: Acharya Laxmikant Dixit: అయోధ్యలో విషాదం.. ప్రాణ ప్రతిష్ట పూజలు చేసిన పూజారి మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి

 

అయితే అనూహ్యంగా ఆ యువతి చింటూ ప్రేమను తిరస్కరించింది. తన ప్రేమను కాదనడంతో చింటూ మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపంతో తమ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడు అఘాయిత్యానికి పాల్పడడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భారత సైన్యంలో చేరి మంచిగా పనిచేసి కుటుంబానికి ఆసరా నిలుస్తాడనుకుంటే ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసింది. చింటూ మృతితో గ్రామంలో విషాద వాతావరణం అలుముకుంది. కాగా సమాచారం అందుకున్న దోమ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు సమాచారం. పోస్టుమార్టం అనంతరం చింటూ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More