Home> క్రైమ్
Advertisement

Faulty Oximeter: పనిచేయని ఆక్సీమీటర్ శవానికి పెట్టి.. బతికే ఉన్నాడని 18 నెలలు శవాన్ని ఇంట్లో పెట్టుకుని..

Faulty Oximeter : ఉత్తర్ ప్రదేశ్‌లో ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిగా ఉన్న విమ్‌లేష్ అనే వ్యక్తి చనిపోయినప్పటికీ.. కుటుంబం మాత్రం అతడు ఇంకా బతికే ఉన్నాడని భ్రమించింది. భ్రమించడమే కాదు.. విమ్‌లేష్ ఇంకా బతికే ఉన్నాడు కానీ కోమాలో ఉన్నాడనే భ్రమలో అతడి శవానికే సపర్యలు చేశారు.

Faulty Oximeter: పనిచేయని ఆక్సీమీటర్ శవానికి పెట్టి.. బతికే ఉన్నాడని 18 నెలలు శవాన్ని ఇంట్లో పెట్టుకుని..

Faulty Oximeter, Deadbody Kept At Home : ఉత్తర్ ప్రదేశ్‌లో ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిగా ఉన్న విమ్‌లేష్ అనే వ్యక్తి చనిపోయినప్పటికీ.. కుటుంబం మాత్రం అతడు ఇంకా బతికే ఉన్నాడని భ్రమించింది. భ్రమించడమే కాదు.. విమ్‌లేష్ ఇంకా బతికే ఉన్నాడు కానీ కోమాలో ఉన్నాడనే భ్రమలో అతడి శవానికే సపర్యలు చేశారు. అలా ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 18 నెలల పాటు శవాన్ని ఇంట్లో పెట్టుకుని రేపోమాపో కోమాలోంచి లేచొస్తాడని ఎదురుచూశారు. అయితే, అతడు ఆఫీసుకు రాకపోతుండటంతో అనుమానం వచ్చిన ఇన్‌కమ్ టాక్స్ విభాగం ఉన్నతాధికారులు.. విమ్లేష్‌కి ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందిగా స్థానిక పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పురమాయించారు. 

అలా పోలీసులు, వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ సిబ్బంది రంగప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. విమ్‌లేష్ కోమాలో లేడని.. అతడు చనిపోయాడని ఆ కుటుంబానికి నచ్చ చెప్పి అతడి అంత్యక్రియలు పూర్తి చేయించేసరికి అధికారులకు తల ప్రాణం తోకకొచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది.

సంచలనం సృష్టించిన ఈ ఘటనపై యూపీ సర్కారు విచారణకు ఆదేశించింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఇంతకీ ఆ కుటుంబం అంతా భ్రమపడటానికి కారణం ఏంటో తెలిస్తే అవాక్కవడం మీ వంతవుతుంది. విమ్‌లేష్ గదిని పరిశీలించిన అధికారులు.. కుటుంబంలో ఒక్కొక్కరిని వేర్వేరుగా పిలిచి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే.. విమ్‌లేష్ చేతి వేళ్లకు పెట్టిన ఆక్సీమీటర్‌లో నిరంతరంగా రీడింగ్ చూపించిందని.. అందుకే అతడు ఇంకా బతికే ఉన్నాడని నమ్మిన అతడి తల్లి.. తన కుటుంబం మొత్తాన్ని కూడా నమ్మేలా చేసింది. కానీ ఆ కుటుంబం మొత్తానికి తెలియని మరో విషయం ఏంటంటే.. ఆ ఆక్సీమీటర్ సరిగ్గా పనిచేయడం లేదని. అవును.. పనిచేయని ఆక్సీమీటర్ చూపించిన రీడింగ్స్ చూసి తన కొడుకు బతికే ఉన్నాడని భ్రమపడిన అతడి తల్లి.. ఆ కుటుంబం మొత్తం నమ్మేలా చేసింది.

ఇదే విషయమై విమ్‌లేష్ భార్య మితాలి దీక్షిత్‌ను విచారించగా.. తన భర్త చనిపోయాడని తనకు అప్పుడే అర్థమైందని, అదే విషయాన్ని భర్త ఆఫీసు వాళ్లకు కూడా సమాచారం అందించానని చెప్పుకొచ్చింది. అయితే, తన కుటుంబం మాత్రం విమ్‌లేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని మరో లేఖ పంపించి ఆఫీసును తప్పుదోవ పట్టించిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఇక ఇప్పుడు తేలాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ 18 నెలల పాటు ఆ కుటుంబం విమ్‌లేష్ వేతనం కూడా తీసుకుందా అనే విషయమై పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Also Read : Man Shoots Girlfriend: గాళ్‌ఫ్రెండ్‌ని గన్‌తో కాల్చి పారిపోబోయాడు.. ఇంతలోనే..

Also Read : Man Buried Alive: పైసల కోసం ప్రాణం ఉండగానే యువకుడిని పాతిపెట్టారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More