Home> బిజినెస్
Advertisement

EPFO E-nomination: ఈ-నామినేషన్ దాఖలు అవసరం ఎంత? చేయకుంటే ఏమౌతుంది?

EPFO E-nomination: ఈపీఎఫ్​ చందాదారులు ఈ-నామినేషన్ పూర్తి చేశారా? ఇప్పుడపు ఈ-నామినేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది ఈపీఎఫ్​ఓ. లేదంటే పలు ప్రయోజనాలను కోల్పోతారని హెచ్చరించింది.

EPFO E-nomination: ఈ-నామినేషన్ దాఖలు అవసరం ఎంత? చేయకుంటే ఏమౌతుంది?

EPFO E-nomination: మీరు సంఘటిత రంగాల్లోని ఏదైనా సంస్థలో పని చేస్తున్నారా? అయితే మీకు ఓ అలర్ట్​. ఎంప్లాయిస్​ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్​ఓ) నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ-నామినేషన్​ దాఖలు చేయడం తప్పనిసరి.  ఈ-నామినేషన్ చేయకుంటే.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కుదరదు. దీనితో పాటు.. ఈ-నామినేషన్ ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం.

ఈ-నామినేషన్ ఎందుకు?

ఈపీఎఫ్​ ఖాతాదారుల కుటుంబానికి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో.. ఈ-నామినేషన్ తప్పనిసరి చేసింది. నామినికి సంబంధించిన సమగ్ర వివరాలు సమర్పించేందుకు.. ఈ-నామినేషన్ అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ఈ-నామినేషన్ సమర్పించడం ద్వారా.. ఖాతాదారుడికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే.. నామినీకి పీఎఫ్​ జమ డబ్బులతో పాటు పెన్షన వంటివి ఇచ్చేందుకు వీలుపడుతుంది. ఈ-నామినేషన్ ద్వారా పూర్తిగా ఆన్​లైన్​ ద్వారానే నామిని.. చందాదారుడి జమ డబ్బులను తీసుకోవచ్చు.

బీమా కూడా..

ఈపీఎఫ్​ఓ ఖాతాదారులు.. ఈ-నామినేషన్ పూర్తి చేయడం ద్వారా ఎంప్లాయ్​ డిపాజిట్​ లింక్డ్​ ఇన్సూరెన్స్ స్కీమ్​ (ఈడీఎల్​ఐ ఇన్సూరెన్స్ కవర్​) ద్వారా రూ.7 లక్షల బీమాకు అర్హత సాధిస్తారు. అంటే ఈపీఎఫ్​ఓ చందాదారుడు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు.. నామినీకి రూ.7 లక్షల వరకు బీమా లభిస్తుంది.

ఈ-నామినేషన్​ చేయడం ఎలా?

  • ముందుగా ఈపీఎఫ్​ఓ అధికారిక వెబ్​సైట్లోకి లాగిన్ అవ్వాలి.
  • సర్వీస్​ సెక్షన్​లో.. ఫర్ ఎంప్లాయిస్ ఆప్షన్​ను ఎంచుకోవాలి.. కొత్త విండో ఓపెన్​ అవుతుంది.
  • ఇందులో యూఏఎన్​ నంబర్​, పాస్​వర్డ్​తో లాగిన్ అవ్వాలి
  • మేనేజ్ ట్యాబ్​లో.. ఈ-నామినేషన్ ఆప్షన్​ను ఎఁచుకోవాలి. ఇక్కడ ఎటువంటి వివరాలు సమర్పించాలో ఉంటుంది. వాటిన్నింటిని పంపి సేవ్​ ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఓపీడీఎఫ్​ ఓపెన్​ అవుతుంది. దానిని ఈ-సైన్ చేయాలి. దీనితో ఈ-నామినేషన్​ ప్రక్రియ పూర్తయినట్లు.
  • ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలాంటి హార్డ్​ కాపీ ఈపీఎఫ్​ఓకు పంపించాల్సిన అవసరం లేదు.

నోట్​: ఈపీఎఫ్​ఓ ఈ-నామినేషన్​ దాఖలు చేసేందుకు చివరి తేదీ అంటూ లేదు. ఎప్పుడైనా ఈ-నామినేషన్ దాఖలు చేయొచ్చని ఈపీఎఫ్​ఓ స్పష్టం చేసింది.

Also read: Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డిజీల్‌ ధరలు.. ఐదు రోజుల్లో రూ. 3.10 పెరిగిన పెట్రోల్‌ రేట్!!

Also read: Gold and Silver Price Today: మరోసారి షాకిచ్చిన పసిడి ధర.. హైదరాబాద్‌లో బంగారం, వెండి రేట్లు ఎంత పెరిగాయంటే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More