Home> బిజినెస్
Advertisement

Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో అద్భుతమైన ఫీచర్, పాత మెస్సేజ్‌లు సెర్చ్ చేసే అవకాశం

Whatsapp New Feature: వాట్సప్ యూజర్లకు మరో శుభవార్త. ఇకపై మీ పాత మెస్సేజ్‌లను తేదీ ఆధారంగా సెర్చ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. త్వరలో ఈ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది.

Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో అద్భుతమైన ఫీచర్, పాత మెస్సేజ్‌లు సెర్చ్ చేసే అవకాశం

Whatsapp New Feature: వాట్సప్ యూజర్లకు మరో శుభవార్త. ఇకపై మీ పాత మెస్సేజ్‌లను తేదీ ఆధారంగా సెర్చ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. త్వరలో ఈ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది.

వాట్సప్ నుంచి మరో కొత్త ప్రకటన వెలువడింది. త్వరలో సెర్చ్ మెస్సేజెస్ బై డేట్ ఫీచర్ త్వరలో ప్రవేశపెట్టనుంది. యాప్‌లో కొత్తగా కన్పించనున్న న్యూ క్యాలెండర్ ఐకాన్‌పై తేదీ టైప్ చేయడం ద్వారా పాత మెస్సేజ్‌లను సెర్చ్ చేసే ఫీచర్ ఇది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌పై వాట్సప్ పనిచేస్తోంది. త్వరలో లాంచ్ చేయనుంది. 

పాత మెస్సేజ్‌లు సెర్చ్ చేసే ఫీచర్

బీటా అప్‌డేట్ బ్లాగ్ WaBetaInfoలో వాట్సప్ ఈ విషయాన్ని వెల్లడించింది. తేదీ ఆధారంగా పాత మెస్సేజ్ సెర్చే చేసే ఫీచర్‌పై పనిచేస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి రెండేళ్ల క్రితం ఈ ఫీచర్‌ను వాట్సప్ నిషేధించింది. ఇప్పుడు తిరిగి లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయవచ్చు

వాట్సప్ ఇటీవల కొత్త ఫీచర్ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ప్రకారం బీటా యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో వచ్చాక..ప్రైవసీ సెట్టింగ్‌లో భాగంగా చాలా వెసులుబాట్లు కలగనున్నాయి. దీనికోసం వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎక్కౌంట్స్‌లో వెళ్లాలి. అందులోంచి ప్రైవసీ సెలెక్ట్ చేయాలి. అక్కడ లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ అనుంటే..ఈ ఫీచర్ మీకు అందుబాటులో వచ్చేసినట్టే.

Also read: Amazon-Flipkart Sales: సెప్టెంబర్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు, డిస్కౌంట్ల సందడి, షాపింగ్‌కు రెడీనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More